chandrababu busy with legal and police officials

Chandrababu faces new problem after forensic report

note for vote, cash for vote, AP chief minister chandrababu, phone conversation, Revanth reddy, mla stphenson, phone signals, Forensic Science Laboratory, tower location, jubliee hill, road number 24, Telangana TDP, cash for vote, note fo vote, Telangana government, ACB officials, balakrishna, nara lokesh, chandrababu, jagan, congress, vote for note, Geeta Reddy, Revanth Reddy Case, Telangana TDP

andhra pradesh chief minister chandrababu naidu busy with legal and police officials over cash for vote scam

ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి.. ఇంకేం చేయాలి.. సలహాలివ్వరూ ప్లీజ్..

Posted: 06/14/2015 12:31 PM IST
Chandrababu faces new problem after forensic report

ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పార్టీ సీనియర్ నేతల్లో గుజులు ప్రారంభమైంది. ఈ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక వీడియో, అడియో టేపులు నిజమైనవేనని తేల్చిచెప్పిన పక్షంలో ఎలా చేస్తే ఈ కేసు నుంచి బయటపడవచ్చునని తర్జనభర్ఝనలు పడుతున్నారు. ఈ కేసులో విచారణ ఎదుర్కునే పక్షంలో ఏం చెప్పాలి.. ఎలా చెప్పాలి.. ఇంకేం చేయాలి.. సలహాలివ్వరూ ప్లీజ్..అని చంద్రబాబు కోరుతున్నారట. దీనిలో భాగంగానే ఆయన ఆదివారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు.  ఈ భేటీలో ఏపీ డీజీపి జేవీ రాముడు, ఏసీబీ డీజీ మాలకొండయ్య, ఇంటిలిజెన్స్ఏడీజీలతో బాబు  భేటీ అయ్యారు.  ఒకవేళ కోర్టు నోటీసులు వస్తే ఈ కేసును ఎలా ఎదుర్కొవాలి అనే దానిపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు కౌంటర్ అటాక్ ఎలా చేయాలి? అనే అంశంపైనే వాటి భేటీ సాగినట్లు సమాచారం.
 
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ తో ఓటు కొనుగోలు కోసం ప్రయత్నించి టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన కేసుకు సంబంధించిన అన్ని ఆడియో, వీడియో టేపులు పూర్తిగా నిజమైనవేనని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం. అవి ఎక్కడా ఉద్దేశపూర్వకంగా కత్తిరించి అతికినవి (కట్ అండ్ పేస్ట్) కావని తేల్చినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఎఫ్‌ఎస్‌ఎల్ ఈ మేరకు ఏసీబీ అధికారులకు ప్రాథమిక నివేదికను అందించిందని, వీటికి సంబంధించి అధికారిక నివేదికలను సోమవారం నేరుగా కోర్టుకు అందించనుందని సమాచారం. ఈ నేపథ్యంలో తనను తాను రక్షించుకునేందుక చంద్రబాబు సాధ్యమైనన్ని మార్గాలను అన్వేషించే పనిలో భాగంగా అటు న్యాయనిపుణులు, చట్టానికి ప్రధినిధులుగా వున్న అధికారులు, పార్టీ సీనియర్ నేతలతో చర్చోపచర్చలు జరుపుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu  Revanth Reddy  Telangana TDP  cash for vote  Forensic Science Laboratory  

Other Articles