acb raids revantha reddy residence, 2 others in cash for vote row

Anti corruption bureau raids revanth reddy s house

yanamala Ramkrishnudu, ap cabinet, note for vote case, revanthreddy, cashfor vote controversy case, chandrababu, chandrashekar Rao, KCR, Telangana government, Revanth reddy, Telangana TDP, Harikrishna, ntr legacy, note fot vote case, bribery case, Telangana mlc elections, stephen, nominated mla stephen, ACB, anti corruption bureau, AK Khan, KTR, nara lokesh, pavan kalyan, jr ntr, Ap government, ap cm chandrababu, ysrcp, ys jagan

Anti-Corruption Bureau (ACB) of Telangana on Tuesday conducted searches at the residences of TDP MLA A. Revanth Reddy and two other accused in the cash-for-vote scam.

రేవంత్ రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు.. 15 వరకు రిమాండ్ పోడిగింపు

Posted: 06/09/2015 09:43 PM IST
Anti corruption bureau raids revanth reddy s house

ఓటుకు నోటు కేసులో అభియోగాలు ఎదుర్కోన్ని అరెస్టయిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇంట్లో ఇవాళ ఏసీబి అధికారులు దాడులు చేశారు. రేవంత్ రెడ్డితో పాటు మరో ఇద్దరు నిందితులు ఉదయసింహం, సెబాస్టియన్ ఇళ్లల్లోనూ ఏసీబి అధికారులు డీఎస్సీ సునితారెడ్డి ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. రేవంత్ రెడ్డి నివాసం నుంచి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సుమారు ఐదుగంటల పాటుగా తనీఖీలు కొనసాగుతున్నాయి. రేవంత్ ఇంట్లోని కంప్యూటర్లో.. ఓటుకు నోటు కేసుకు సంబంధించి పలు కీలక ఆధరాలు గుర్తించినట్లు సమాచారం. ఈ కంప్యూటర్లో ఈ కేసుకు సంబంధించి అన్ లైన్ లావాదేవీలను గుర్తించినట్టు తెలుస్తుంది.

 ఈ కేసులో నిందితులకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా రేవంత్ నివాసంలో సోదాలు ముగిసాయని హర్డ్ డిస్క్, కంప్యూటర్ ను మాత్రమే తాము తీసుకెళ్తున్నామని ఏసిబి అధికారులు తెలిపారు.రేవంత్ రెడ్డి పాస్ పోర్టు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఈ కేసులో మరో నిందితుడైన సెబాస్టియన్ ఇంట్లో పాస్ పోర్టు, బ్యాంకు పాస్ బుక్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఉదయసింహ ఇంట్లో విదేశీ మద్యం భారీగా లభ్యమైందని ఏసీబీ అధికారులు తెలిపారు.

కాగా నాలుగు రోజుల కస్టడీ నేటి సాయంత్రంలో ముగియడంతో తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డిని, అతనితో పాటు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కోంటున్న మరో ఇద్దరు నిందితులు ఉదయసింహం, సెబాస్టియన్ లను ఏసీబి అధికారులు కోర్టులో హాజరుపర్చారు. దీంతో వారి రిమాండును ఈ నెల 15 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఏసీబి కస్టడీలో అధికారులు తనను ఎంతగానో వేధించారని రేవంత్ రెడ్డి వాపోయారు. తనను బెంచ్‌పై పడుకోబెట్టారని, కనీసం టాయిలెట్‌కు కూడా అనుమతించలేదని ఆయన ఏసీబీ కోర్టు జడ్జికి మొరపెట్టుకున్నారు. కస్టడీలో తనకు మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదని, రాత్రుళ్ళు నిద్ర పట్టక అలమటించానని రేవంత్ ఫిర్యాదు చేశారు. అంతకు ముందే వారికి ప్రత్యేక వాహనంలో ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లిన అధికారులు అక్కడ వారికి వైద్యపరీక్షలు నిర్వహించిన పిమ్మట కోర్టులో హాజరుపర్చారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TDP  note for vote case  revanthreddy  acb  acb raid  acb dsp sunita reddy  

Other Articles