Doctors in Texas perform historic skull and scalp transplant surgery

First ever skull scalp transplant surgery performed by us doctors

US doctors perform historic skull and scalp transplant surgery, skull, transplant, Cancer, James Boysen, skull-scalp transplant, surgery, US, scalp transplant, Michael Klebuc, MD Anderson Cancer Center, diabetes, US doctors, Houston Methodist Hospital

In a major breakthrough in transplant surgery, the world's first skull-scalp transplant was performed by American surgeons on a man who suffered a large head wound from cancer treatment

వైద్యరంగంలో అద్భుతం.. చారిత్రక శస్త్రచికిత్స.. విజయవంతం

Posted: 06/05/2015 10:25 PM IST
First ever skull scalp transplant surgery performed by us doctors

ప్రపంచ వైద్యరంగశాస్త్రంలో కొత్త అధ్యయాన్ని లిఖించారు అగ్రరాజ్యం అమెరికాలోని వైద్యులు. వైద్యరంగంలోనే ఓ అద్భుతంగా.. అరుదైన చారిత్రక శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి.. వైద్యరంగ చరిత్రలో మరో సువర్ణాధ్యయనాన్ని లిఖించారు. ప్రపంచంలోనే తొలిసారిగా కపాలం మార్పిడి ఆపరేషన్ చేశారు. కేన్సర్ చికిత్స కారణంగా తలమీద పెద్ద గాయం కావడంతో.. అతడికి కపాలాన్ని మార్చడం తప్ప వేరే గత్యంతరం లేకపోయింది. దీంతో 15 గంటల పాటు ఆపరేషన్ చేసి అతడికి పూర్తిగా కొత్త కపాలాన్ని అమర్చారు. జేమ్స్ బోయ్సెన్ (55) ఆస్టిన్లో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నారు. ఆయనకు క్రానియోఫేషియల్ టిష్యూ మార్పిడితో పాటు ఒకేసారి కిడ్నీ, పాంక్రియాస్ కూడా మార్పిడి చేశారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ బృందానికి డాక్టర్ మైఖేల్ క్లెబక్ నేతృత్వం వహించారు. ఇది చాలా సంక్లిష్టమైన మైక్రోవాస్క్యులర్ ప్రొసీజర్ అని ఆయన తెలిపారు.  తాము పుర్రె ఎముకలతో పాటు మాడు కణజాలాన్ని, దాంతోపాటు వచ్చే రక్తనాళాలను కూడా మార్చామన్నారు.

ఇలా కపాలాన్ని మార్చడం గానీ, ఒకేసారి మూడు అవయవాలను మార్చడం గానీ ఇంతవరకు ప్రపంచంలో ఎప్పుడూ, ఎవరికీ మార్చలేదని కూడా క్లెబక్ వివరించారు. రోగి బోయ్సెన్కు వరుసపెట్టి రకరకాల కేన్సర్లు వచ్చాయని, దాంతో అనేక ఆపరేషన్లు, రేడియేషన్ జరిగాయని తెలిపారు. ఫలితంగా ఆయన తల మీద పెద్ద గాయం అయ్యిందన్నారు. గతంలోనే ఆయనకు ఒకసారి కిడ్నీమార్పిడి జరగడంతో అప్పటి నుంచి ఇమ్యూన్ సప్రెషన్ మందులు వాడుతున్నారు. కేన్సర్ చికిత్సలో రేడియేషన్ కారణంగా కపాలం దెబ్బతిన్నప్పుడు ఈ మందుల కారణంగా అది నయం కాలేదు. దాంతో ఈ మార్పిడి అంతా చేయాల్సి వచ్చింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles