Ap, Govt, Capital, Meeting, Pooja, Elections, Election commission

Ap state govt getting ready to inaughration ceremony of new ap capital

Ap, Govt, Capital, Meeting, Pooja, Elections, Election commission

Ap state govt getting ready to inaughration ceremony of new ap capital. The ap govt write a letter to the Elections commission to give permison to the pooja and a meeting.

ఏపి సర్కార్ పూజకు వేళాయెరా

Posted: 06/04/2015 10:43 AM IST
Ap state govt getting ready to inaughration ceremony of new ap capital

పూజకు వేళాయెరా స్వామీ.. అంటూ అప్పుడెప్పుడో పాత కాలంలో ఓ పాట ఉండేది. ఇప్పుడు ఇదే లిరిక్ ను వాడుకుంటోంది ఏపి ప్రభుత్వం. ఇంతకీ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే.. ఏపి ప్రభుత్వం ఎంతో శ్రమిస్తున్న నూతన రాజధాని నిర్మాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక భూమి పూజకు కూడా చకచకాల పనులు జరుగుతున్నాయి. కానీ అంతలోనే ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ప్రస్తుతం ఏపి ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దాంతో ఏం చెయ్యాలో అర్థం కాని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అయితే భూమి పూజకు, ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న సభకు అనుమతి ఇవ్వాలని ఏపి ప్రభుత్వం ఎన్నికల కమీషన్ కు లేఖ రాసింది.

ఇక మరోపక్క రాజధాని భూమిపూజ కార్యక్రమానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ముఖ్యమంత్రి భధ్రతాధికారి జోజి కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే , జేసీ శ్రీధర్‌, రూరల్‌ ఎస్పీ నారాయణనాయక్‌ బుధవారం భూమి పూజ ఏర్పాట్లను పరిశీలించారు. భూమిపూజకు ఎన్నికల కమిషన్‌ అనుమతి కోరినట్టు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే తెలిపారు. ఎలక్షన్‌ కోడ్‌ రాక ముందు నుంచే భూమి పూజ ఏర్పాట్లు చేస్తున్నందున అనుమతి లభించవచ్చని తెలిపారు. శుక్రవారం నాటికి అనుమతి సంగతి తెలుస్తుందని అన్నారు. అనంతరం హెలీప్యాడ్‌ , వేదిక ఏర్పాట్లను పర్యవేక్షించారు. మొత్తానికి ఎన్నికల కమీషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. చకచకా పూజ కార్యక్రమాలను ముగించాలని ఏపి ప్రభుత్వం అన్ని రకాలుగా రెడీ అయింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ap  Govt  Capital  Meeting  Pooja  Elections  Election commission  

Other Articles