Telangana, MLC, elections, revanth reddy, TDP, Narachandrababu naidu

Telangana tdp leaders in dilamo on revanth reddy arrest by acb officials

Telangana, MLC, elections, revanth reddy, TDP, Narachandrababu naidu

Telangana TDP Leaders in dilamo on Revanth reddy arrest by acb officials. On Telangana MLC elections Revanth reddy arrest and MLC elections, TDP president Nara chandrababu naidu will discuss.

రేవంత్ రెడ్డి అరెస్ట్ తో టిడిపి డైలమా

Posted: 06/01/2015 09:09 AM IST
Telangana tdp leaders in dilamo on revanth reddy arrest by acb officials

తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ప్రాతినిధ్యవహిస్తున్న వారిలో రేవంత్ రెడ్డి కీలకనేతగా ఎదిగారు. అయితే గత కొంత కాలంగా తెలంగాణ ప్రభుత్వం మీద, కేసీఆర్ మీద మాటల తూటాలు పేల్చారు. తెలంగాణ అసెంబ్లీ నుండి బహిష్కరణకు గురైన రేవంత్ రెడ్డి తన మాటలకు మరింత పదును పెంచారు. కేసీఆర్ మీద తీవ్ర ఆరోపణలతో ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కారు రేవంత్ రెడ్డి. అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు లంచావతారాలు బయటకు వస్తున్నాయి. తెలంగాణ సర్కార్ కు ఝలక్ ఇవ్వాలనుకున్న తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి కే ఝలక్ ఇచ్చారు కేసీఆర:. అందులో భాగంగా ఎమ్మెల్యే స్టీఫెన్ కు యాభై లక్షల రూపాలయలు ఇవ్వచూపుతూ వీడియోతో సహా దొరికిపోయిన రేవంత్ రెడ్డి జడ్జి ముందు హాజరయ్యారు. 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ జడ్జి నిర్ణయం తీసుకున్నారు. అయితే రేవంత్ రెడ్డి అరెస్టుతో తెలుగుదేశం పార్టీ నేతల్లో డైలమా మొదలైంది. తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ పోలింగ్ పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంట్లో సమావేశమయ్యారు తెలంగాణ టిడిపి నేతలు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్న పరిణామాలపై అధినేతతో చర్చించనున్నారు టిటిడిపి నేతలు. సాయంత్రం జరిగే ఎన్నికలపై ఎలా వ్యవహరించాలి..? రేవంత్ రెడ్డి అరెస్టు మీద ఎలా స్పందించాలి..? టిటిడిపిపై వస్తున్న ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలి అన్నదానిపై తెలుగుదేశం శ్రేణులు తలమునకై ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడుతో సమావేశం తర్వాత టిటిడిపి నేతలు తమ స్ట్రాటజీ ఏంటో తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీసం ఒక్క ఎమ్మెల్సీ స్థానానైనా స్వంతం చేసుకుందుందని గట్టిగా నమ్మిన తెలుగుదేశం పార్టీ కి గట్టి ఝలక్ తగిలింది. నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రేంవత్ రెడ్డి వ్యవహారం మీద, ఎమ్మెల్సీ ఎన్నికల మీద సమీక్షించనున్నారు కాబట్టి టిటిడిపి నాయకులు ఏం జరుగుతోంది..? ఏం చెయ్యాలి అన్న ఆలోచనలతో తలపట్టుకు కూర్చున్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  MLC  elections  revanth reddy  TDP  Narachandrababu naidu  

Other Articles