meta: Jayalalitha to sworn in as CM on Saturday

Jayalalithaa to swear in as chief minister at 11 am on saturday

Jayalalitha to sworn in as CM on Saturday, Jayalalitha sworn in as CM, Jayalalitha sworn in as CM of Tamilnadu, Jayalalitha to sworn in as CM for fifth time, AIADMK, invitation, Rosaiah, jayalalithaa, tamilnadu cm, swearing in cermony, trs, kavitha

J Jayalalithaa will take oath as Tamil Nadu chief minister at 11 am on Saturday. She had resigned eight months ago after a Bangalore court convicted her in a corruption case

రేపే శుభముహూర్తం.. జయలలిత ఐదవసారి ప్రమాణస్వీకారం

Posted: 05/22/2015 10:22 PM IST
Jayalalithaa to swear in as chief minister at 11 am on saturday

శుభముహూర్తం కుదిరింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఐదవ పర్యాయం మళ్లీ బాధ్యతలను చేపట్టనున్నారు. తమిళనాట ప్రజలు, అన్నా డిఎంకే కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు, నేతలు ఎప్పడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. ఇక మరికోన్ని గంటల వ్యవధిలో తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణ స్వీకరాం చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తాన్ని కూడా ఖరారు చేశారు.

దాదాపు 8 నెలల తర్వాత తొలిసారిగా ప్రజలకు దర్శనమిచ్చిన 'అమ్మ'.. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి, తన మంత్రివర్గంలో ఉండబోయే మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు. బెంగుళూరు అగ్రహర పరప్పనా ప్రత్యక కోర్టు తీర్పుతో కటకటావెనక్కి వెళ్లిన జయలలిత.. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పటి నుంచి పోయెస్ గార్డన్స్ కే పరిమితమైంది. సుదీర్ఘ కాలం తర్వాత బయటకు వచ్చిన ఆమె.. ముందుగా ఎంజీ రామచంద్రన్ విగ్రహం వద్ద నివాళులర్పించి.. ఆ తర్వాత గవర్నర్ నివాసమైన రాజ్భవన్కు వెళ్లారు. అక్కడ గవర్నర్ రోశయ్యను కలిసి తనకు మద్దత్తునిస్తున్న జాబితాను ఆయనకు సమర్పించారు.

తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా అన్నా డీఎంకే అధినేత్రి జయలలితను ఆ రాష్ట్ర గవర్నర్ కే రోశయ్య ఆహ్వానించారు. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం రాజీనామాను రోశయ్య ఆమోదించినట్టు వెల్లడించింది. అంతకుముందు ఇవాళ ఉదయం అన్నా డీఎంకే శాసనసభ పక్ష నాయకురాలిగా జయలలిత ఎన్నికయ్యారు. జయలలిత బయటకు రాగానే ఒక్కసారిగా అభిమానులంతా.. 'అమ్మ తిరిగొచ్చింది' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జయలలితకు శుభాకాంక్షలు తెలియజేశారు. జయలలిత సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎంపీ కవితకు ఆహ్వానం పంపారు. కవిత రేపు ఉదయం చెన్నై వెళ్లనున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  tamilnadu cm  swearing in cermony  

Other Articles