91.42 percent outcome in Andhrapradesh AP SSC Results 2015 Released

Tenth class results of andhrapradesh released

Andhrapradesh 10th Class Results, AP state 10th results released, ap ssc result 2015, Ganta SrinivasaRao, AP Education minister Ganta SrinivasaRao, AP government schools, 10th Class AndhraPradesh Board Result 2015, 10th Class Andhra pradesh Board Result 2015, 91.42 percent outcome in Andhrapradesh SSC Results, Andhra University, Yvs Murthy auditorium

91.42 percent outcome as Education minister Ganta SrinivasaRao realeased tenth class results of Andhrapradesh ssc board today.

నవ్యాంధ్ర పదోతరగతి పరీక్షా ఫలితాల్లో 91.42 శాతం ఉత్తీర్ణత

Posted: 05/20/2015 04:26 PM IST
Tenth class results of andhrapradesh released

రాష్ట్ర పునర్విభజన అనంతరం నవ్యాంధ్ర ప్రదేశ్ లో తొలిసారి జరిగిన పదో తరగతి పరీక్ష ఫలితాలను మంత్రి ఘంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. రోటిన్ ను కోనసాగిస్తూ నవ్యాంధ్ర పరీక్షఃల ఫలితాలలోనూ అమ్మాయిలు తమ అద్భుత ప్రతిభను కనబర్చి పైచేయి సాధించారు. తొలిసారి ఎస్‌ఎస్‌సీ పరీక్షల ఫలితాలో మొత్తంగా 91.42 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. ఇవి గతం కన్నా 0.26 శాతం ఉత్తీర్ణత అధికంగా నమోదైందని మంత్రి వెల్లడించారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సటీలోని వైవీఎస్ మూర్తి అడిటోరియంలో మంత్రి గంటా పదోతరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేసిన అనంతరం వాటి వివరాలను తెలిపారు.

మార్చిలో జరిగిన టెన్త్ పరీక్షలకు మొత్తం 6 లక్షల 44 వేల 961 మంది విద్యార్థులు హాజరు కాగా వారిలో రెగ్యూలర్ విద్యార్థులు 5 లక్షల 54 వేల 536 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే అబ్బయిల కన్నా పైచేయి సాధించిన బాలికలు 0.59శాతం అధికంగా ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 91.71 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 91.15శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 3645 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణ నమోదైందని మంత్రి వెల్లడించారు. అయితే రెండు పాఠశాలల్లో మాత్రం సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు.

నవవ్యాంధ్ర లో తొలి పదో తరగతి పరీక్ష ఫలితాల 98.54 శాతం ఉత్తీర్ణతలో కడప జిల్లాకు మొదటి స్థానంలో నిలువగా, 71.29 శాతంతో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలిచింది. ఎయిడెట్ పాఠశాలల్లో 85.2 శాతం ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. జిల్లా పరిషత్ పాఠశాలల్లో 89 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. జూన్ 18 నుంచి జులై 1 వరకు పదోతరగతి అడ్వాన్డ్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AndhraPradesh  10th Class Results  Ganta SrinivasaRao  

Other Articles