క్రమశిక్షణ..ఎక్కడ పని చేస్తున్న ఇది ఉండాలి. ఒకవేళ లేకపోతే మాత్రం చాలా కష్టం. అయితే అన్నింటికన్నా మిలిటరీలో మాత్రం ఖచ్చితంగా పాటించాల్సిన రూల్ ఇది. అయితే తాజాగా తమ రూల్స్ తామే బ్రేక్ చేసినందుకు చితకొట్టారు. ఇంతకీ ఏ దేశ ఆర్మీలో జరిగింది అని అనుకుంటున్నారేమో కానీ జరిగింది ఆర్మీలో కాదు ఐఎస్ఐఎస్ లో. అవును ఉద్రవాద కార్యకలాపాల ద్వారా ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఆ ఐఎస్ఐఎస్ వాళ్లే. తాము పెట్టుకున్న నియమనిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించి సిగరెట్లు తాగారని సొంత గ్రూపు ఫైటర్లనే ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ చావు దెబ్బలు కొట్టింది. వారిని కర్కశంగా కొడుతూ రక్తం కళ్ల చూసింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది.
ఆ వీడియోలు చూపించిన ప్రకారం సిగరెట్ తాగిన కొందరు సొంత ఫైటర్లనే వరుసగా ఓ గోడకు ఎదురుగా కూర్చోబెట్టి ఉంచారు. కొందరు ముసుగు ధరించిన ఉగ్రవాదులు వారిపై కాళ్లు పెట్టి ఎక్కుతూ దిగుతూ కనిపించారు. అంతేకాకుండా వారి చేతుల్లోని తుపాకీ బ్యారెల్తో చితక్కొట్టుడు కొట్టారు. మరొకరినైతే ఏకంగా తల బద్ధలయ్యేలా బాదారు. పిడిగుద్దులు కురిపించారు. పొగత్రాగడం ఇస్లాం నిబంధనలకు వ్యతిరేకమని, పొగతాగడమంటే మెల్లగా ఆత్యహత్య(స్లో స్యూసైడ్)కు పాల్పడటమేనని వారు భావిస్తారట. ఇకపై ఎవరు ఎలాంటి దిక్కార చర్యలకు దిగకూడదని వారిని క్రూరంగా హింసించినట్లు ఆ ఉగ్రవాద సంస్థ పేర్కొంది.
*అభినవచారి*
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more