america | india | modi | obama

America change its pinion on india american president barack obama chanting india and modi

america, india, modi, obama

America change its pinion on india. american president barack obama chanting india and modi.

ఒబామా మోదీ జపం ఎందుకు చేస్తున్నారంటే..

Posted: 05/20/2015 12:42 PM IST
America change its pinion on india american president barack obama chanting india and modi

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అంటే ప్రపంచానికి తెలుసు. ప్రపంచంలో ఇన్ని దేశాలు ఉన్నా ఒక్క అమెరికాకు మాత్రమే పెద్దన్న హోదా దక్కింది. మరి అలాంటి అమెరికాకు అధ్యక్షుడు అంటే ప్రపంచంలో ఎంతో ప్రభావశీల వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి ఇప్పుడు భారత ప్రధాని నరేంద్ర మోదీ జపం చేస్తున్నారు. ఒకప్పుడు భారత్ అంటే ఆసియాలో ఓ దేశం.. జనాభా ఎక్కువగా ఉన్న దేశం అన్న ఆలోచన నుండి ఇప్పుడు అమెరికా బయటికి వచ్చింది. భారత్ అంటే ప్రపంచంలో చాలా గొప్పదేశం అన్నంతలా బిల్డప్ ఇస్తోంది. అంతలా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మారడానికి కారణం ఏంటీ.?  మోదీ మానియాకు నిజంగా ఫిదా అయ్యారా..? లేదా పైపైకి అలా అనిపించేలా చేస్తున్నారా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు కింద ఉన్నాయి.

అమెరికా నుండి భారత్ ఎప్పుడూ సహాయం కోసం అర్థిస్తూ ఉండేది. అయితే అప్పుడప్పుడు బారత్ చేసిన ప్రపోజల్స్ ను రిజక్ట్ కూడా చేస్తూ ఉండేది. మరి అలాంటిది ఇప్పుడు మాత్రం ఇండియాకు ఇంత ప్రిపరెన్స్ ఎందుకు వస్తోందీ అంటే.. పరిస్థితులను బట్టి అమెరికా తన స్టైల్ ను మారుస్తూ ఉంటుంది కాబట్టి. గత కొంత కాలంగా తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది కాబట్టి భారత్ తో ఆచితూచి ఉండాలని అమెరికా వ్యూహం. అలాగే భారత ప్రధాని గత కొంత కాలంగా చేస్తున్న విదేశీ పర్యటనలు, అతడికి వస్తున్న ఫాలోయింగ్ తో అమెరికా భయపడిపోతోంది. అందుకే కుదిరితే మోదీ జపం చేస్తోంది. తాజాగా మోదీ గురించి టైమ్స్ మ్యాగజీన్ లోఇంట్రడక్షన్ కూడా రాశారు. చైనాతో జరిగిన ఒప్పందాలు అమెరికాను భయపెడుతున్నాయి. అందుకే ముందు జాగ్రత్తగా బారత్ జపం చేస్తోంది అమెరికా.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : america  india  modi  obama  

Other Articles