Large-hearted Mumbai embraces Pakistani teen with rare illness | India Pakistan Border

Mumbaikars came to rescue the pakistani girl from rare illness

Saba Tarikh Ahmed, Pak Girl Saba Tarikh Ahmed, Saba Tarikh Ahmed treatment, Nazia Saba Tarikh Ahmed, Mumbaikars helps pak girl, pakistan teenage girl mumbai treatment, Mumbai City News

Mumbaikars came to rescue the Pakistani Girl from rare illness : The Maximum City has shown the maximum support to Saba Tarikh Ahmed, a 15-year-old from Pakistan's Karachi district, who is suffering from a rare, genetic disorder called Wilson's disease. The disease occurs as a result of accumulation of copper in the body, slowly resulting in degeneration of organs like the liver and brain.

పాకిస్థాన్ బాలిక కోసం ముంబైవాసుల పోరాటం

Posted: 05/20/2015 10:48 AM IST
Mumbaikars came to rescue the pakistani girl from rare illness

దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్ ల మధ్య విభేదాలు తారాస్థాయిలో వున్న విషయం తెలిసిందే! కానీ.. జన్మభూమికంటే మానవత్వమే మిన్న అన్న అర్థానికి సైతం ఈ రెండు నిదర్శనంగా నిలుస్తాయని తాజా ఘటన నిరూపించేసింది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఓ బాలిక కోసం యావత్తు ముంబైనగరం చేయూతనందిచడానికి విరాళాలు అందిస్తూ తమ మానవత్వాన్ని చాటిచెప్పారు.

వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్ లోకి సబా తారిక్ అహ్మద్ (15) ఓ అరుదైన వ్యాధితో బాధపడుతూ చికిత్స నిమిత్తం ముంబై నగరానికి తన తల్లిదండ్రులతో వచ్చింది. ఆమెకున్న ఆ వ్యాధి పేరు ‘విల్సన్ డిసీజ్’. ఇది అత్యంత జన్యుసంబంధ వ్యాధి. ఇది శరీరంలోని కాపర్ శాతాన్ని తినేస్తుంది. ఫలితంగా ఊపిరితిత్తులు, మెదడు తదితర అవయవాల్లో ఆర్గానుల పునరుత్పత్తి పూర్తిగా తగ్గిపోతుంది. సమయానికి పూర్తి చికిత్స అందించకపోతే మాత్రం.. ఆ అమ్మాయి కృశించి, చివరికి మరణించాల్సిందే! ఈ వ్యాధి నుంచి తమ కూతురిని కాపాడుకునేందుకు తల్లి నజియా తనతోపాటు రూ.3 లక్షలకుపైగా డబ్బుతో ముంబైలో కాలుపెట్టింది. అక్కడ దక్షిణ ముంబైలోని జస్లోక్ ఆసుపత్రిలో తన కూతురిని అడ్మిట్ చేయించింది. అయితే.. తనతో తీసుకువచ్చిన డబ్బు కొన్నిరోజులకే ఖర్చయిపోయాయి. దీంతో ఏమీ చేయలేక నజియా తిరిగి కరాచీ వెళ్లాలని భావించింది.

అయితే.. ఈ క్రమంలో నజియా సోదరి ఈ మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టింగులు పెట్టింది. వాటిని చూసిన ముంబైవాసులు సబాను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. ఒక్కరోజులోనే రూ.1.5 లక్షలు పోగయ్యింది. కేవలం నెటిజన్లు మాత్రమే కాదు.. ఆసుపత్రి డాక్టర్లు సైతం సాయం చేశారు. ఈ విధంగా ముంబైవాసులు సహాయం అందించడంతో ఆ బాలిక తల్లి సంతోషంతో ఆనందభాష్పాలు వెదజల్లుతూ కృతజ్ఞతలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే నజిమా మాట్లాడుతూ.. ‘నేను పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా ముంబైలో ఎవరికీ చెప్పొద్దని మా ప్రాంతంవారు నాకు చెప్పారు. కానీ, నేను అబద్ధం చెప్పలేదు. ఇండియాలో వైద్యులు మంచివారన్న నమ్మకంతో పాకిస్థాన్ నుంచి వచ్చినట్లుగా తెలిపాను. ఇప్పుడు సబా కోసం హిందూస్థాన్ లో మాపై చూపిన ప్రేమ, ఆప్యాయతను ఎన్నటికీ మరువను’ అని చెప్పింది.

మరోవైపు.. ట్రీట్ మెంటుకు సబా స్పందిస్తున్న తీరును చూసిన అనంతరం డాక్టర్లు సైతం సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఖర్చుకోసం వెనకాడకుండా తమంతు చేయూతనందిస్తున్నారు. డబ్బులేని కారణంగా చికిత్సను ఆపరాదని తాము నిర్ణయించుకున్నట్లుగా జస్లోక్ ఆసుపత్రి సీఈఓ తరంగం జ్ఞాన్ చందానీ వివరించారు. మానవత్వం ఇంకా బతికేవుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saba Tarikh Ahmed  Pakistan Teen Girl  Wilson's disease  

Other Articles