ramdev baba | yoga | gym

Ramdev baba strating ten thousand gym in haryana state

ramdev baba, yoga, gym, fitness, haryana

Ramdev baba strating ten thousand gym in haryana state. Baba ramdev as the ambasder of yoga, ayurvedic medicine.

రామ్ దేవ్ బాబా అయ్యారు జిమ్ బాబా

Posted: 05/20/2015 10:29 AM IST
Ramdev baba strating ten thousand gym in haryana state

రామ్ దేవ్ బాబా పేరు తెలియని వాళ్లు ఉండరు. యోగాతో అందరి దృష్టిని ఆకర్షించారు బాబా రాందేవ్. అంతేనా అప్పుడప్పుడు రాజకీయాల గురించి మాట్లాడి వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా హర్యానా ప్రభుత్వం కేబినెట్ హోదా ఇస్తామంటే కూడా తనకు వద్దంటూ తిరస్కరించారు. పతంజలి ట్రస్టు ద్వారా ఇప్పటికే సేవలు అందిస్తున్న రాందేవ్ బాబా తాజాగా మరో అడుగు ముందుకు వేశారు. హర్యానాలో ఏకంగా పది వేల జిమ్ లను స్టార్ట్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొత్తానికి యోగాతో ఫేమస్ అయినా రాందేవ్ బాబా తాజా నిర్ణయంతో జిమ్ బాబాగా పేరు మారతారేమో చూడాలని జనం అనుకుంటున్నారట.

హర్యానా రాష్ట్రంలో పదివేల జిమ్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు యోగా గురు రాందేవ్‌ తెలిపారు. రేవారిలో నార్‌నౌల్‌లోని జిల్లా పరిషత్‌ భవనంలో పతంజలి డిస్పెన్సరీ కమ్‌ సర్వీస్‌ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.రాష్ట్రంలో ఈ సంవత్సరంలో వెయ్యి యోగ శాలల్ని ప్రారంభించనున్నామని చెప్పారు. యోగాకు ఆదరణ పెంచడానికి ఇది మంచి అవకాశమని అన్నారు. యోగశాలలతో యువతలో మంచి ఆలోచనా విధానాన్ని పెంచడానికి దోహదం చేస్తుందని అన్నారు. యోగా వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతులుగా తయారు అవుతారని అన్నారు. హరిద్వార్‌లోని పతంజలి ఆధ్వర్యంలో ఒక యూనివర్సిటీ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. కాగా రాందేవ్‌ హర్యానా రాష్ట్రానికి యోగా, ఆయర్వేద ప్రచారకర్త అన్న విషయం తెలిసిందే.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ramdev baba  yoga  gym  fitness  haryana  

Other Articles