Saradha scam: ED questions Mithun Chakraborty

Saradha scam ed questions mithun chakraborty actor says he will return money

Saradha scam: ED questions Mithun Chakraborty, bollywood actor Mithun Chakraborty, Saradha scam, Enforcement Directorate, Trinamool Congress MP, Saradha chitfund scam,

The Enforcement Directorate recently questioned Trinamool Congress MP and actor Mithun Chakraborty in connection with the multi-crore Saradha chitfund scam.

శారదా స్కాంలో బాలీవుడ్ నటుడిని ప్రశ్నించిన ఈడీ

Posted: 05/17/2015 04:56 PM IST
Saradha scam ed questions mithun chakraborty actor says he will return money

పశ్చిమ బెంగాల్ లోని తృణముల్ కాంగ్రెస్ నేతలను వణికిస్తున్న భారీ కుంభకోణం శారదా చిట్ ఫండ్స్ కుంభకోణం. ఈ కుంభకోణంలో తాజాగా తృణముల్ కాంగ్రెస్ ఎంపీ, బాలీవుడ్ నటుడు మిధున్ చక్రవర్తి చుట్టూ ఉచ్చు బిగుసుకుంది. ఈ శారదా చిట్ఫండ్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇవాల కోల్కతాలో బాలీవుడ్ ప్రముఖ హీరో, తృణమాల్ కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు మిథున్ చక్రవర్తిని ప్రశ్నించారు. ఆయన వాంగూల్మాన్ని నమోదు చేశారు.

శారదా గ్రూపునకు మిథున్ చక్రవర్తి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. వీటికి సంబంధించిన డీవీడీలు, సీడీలు, రికార్డులను ఈడీ అధికారులకు అందజేశారు. శారదా గ్రూపు నుంచి తాను తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇస్తానని మిథున్ చక్రవర్తి చెప్పారు. వృత్తిపరంగానే శారదా గ్రూపుతో పనిచేశానని, ఎవర్నీ మోసం చేయాలన్న ఉద్దేశం తనకు లేదని మిథున్ చక్రవర్తి చెప్పారు. శారద స్కాంకు సంబంధించి తన పాత్ర లేదని వివరించారు. ఈ విషయంలో ఎప్పుడు, ఎక్కడ ఎలాంటి విచారణకైనా తాను సిద్దమని మిధున్ చక్రవర్తి స్పష్టం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mithun Chakraborty  Saradha scam  Enforcement Directorate  

Other Articles