Luxembourg PM Xavier Bettel all set to wed his gay partner next week

Luxembourg pm to marry gay partner xavier bettel

Luxembourg PM to marry gay partner Xavier Bettel, Xavier Bettel, Luxembourg Prime Minister Xavier Bettel Gauthier Destenay, Gay Marriage, Luxembourg, Wedding, Xavier Bettel, same-sex marriage

Luxembourg Prime Minister Xavier Bettel is to wed his partner Gauthier Destenay next week, sources said on Thursday, just a few months after the tiny duchy legalized same-sex marriage.

ప్రధాని గారు పెళ్లిచేసుకోబోతున్నారు.. ఎవరినో తెలుసా..?

Posted: 05/13/2015 05:00 PM IST
Luxembourg pm to marry gay partner xavier bettel

ప్రశాంత జీవనానికి చిరునామా లాంటి పశ్చిమ యూరప్ దేశం లక్సెంబర్గ్.. మరో అరుదైన ఆఃవిష్కృతానికి వేదిక కానుంది. ఆఃవిష్కృతం అనగానే అదేదో వస్తువనుకోకండీ.. ఇక్కడ అవిష్కృతం కానున్నది సంబరం. ఆ దేశ ప్రధానమంత్రి జేవియర్ బెటెల్.. తన సహచరుడు గోథియర్ను వచ్చే నెలలో పెళ్లాడనున్నట్లు అధికారిక వర్గాలు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపాయి.  స్వలింగ సంపర్కుడయిన జేవియర్.. 2013 డిసెంబర్లో  లక్సెంబర్గ్ ప్రధాని పీఠాన్ని అధిరోహించారు. అంతకు మూడేళ్ల ముందునుంచే ఆయన గోథియర్తో సహజీవనం చేస్తున్నారు.

ప్రధాని హోదాలో ఒక గే  పెళ్లిచేసుకోనుండటం ఇదే ప్రధమం కావడంతో ఈ వేడుకపై సర్వత్రా ఆసక్తినెలకొంది. ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్లు కొన్ని పెళ్లి వేడుకను ప్రత్యేకంగా ప్రచురించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. కానీ వివాహం తన వ్యక్తిగత విషయమని, ప్రచారం అవసరంలేదని ప్రధాని జేవియర్ సున్నితంగా తిర్కరించారు. లక్సెంబర్గ్ నగరంలోని రోమన్ క్యాథలిక్ డచీ చర్చీలో వీరి వివాహం జరగనుంది. ఎన్నికల్లో భారీ మెజారితో గెలిచిన జేవియర్.. లక్సెంబర్గ్లో ఎల్జీబీటీ (లెస్బియాన్, గే, బైసెక్పువల్స్, ట్రాన్స్జెండర్స్) హక్కుల పరిరక్షణకోసం చర్యలు చేపట్టారు. అందులో భాగంగానే రెండు నెలల కిందటే గే మ్యారేజ్ను చట్టబద్ధం చేశారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Luxembourg Prime Minister  Xavier Bettel Gauthier Destenay  

Other Articles