Chandigarh man pays Rs 8.1 lakh for special number for scooter

Chandigarh man pays 8 1 lakh for a fancy number for his honda activa scooter

Chandigarh, Rs. 50, 000 Scooter, 8.1 Lakh for a VIP Number, Honda Activa, Fancy number, VIP Number, CH01BC-0001, Kanwaljit Walia, Commando Caterers, Rs 2.02 lakh for CH01BC-0011, Rs 61000 for CH01BC-0026 at the auction, kanwaljit walia, Rs 8.1 lakh, scooter, Activa, Licensing Authority,VIP number,VIP number sale

A businessman hell-bent on sporting a fancy number on his family's newly-acquired Honda Activa scooter ended up coughing Rs 8.1 lakh at an auction in Punjab's capital.

ఫ్యాన్సీ నెంబరు కోసం చేతి చమురు వదిలించుకున్నాడు..

Posted: 05/12/2015 02:50 PM IST
Chandigarh man pays 8 1 lakh for a fancy number for his honda activa scooter

తల తాకట్టు పెట్టైనా తాననుకున్న పనిచేస్తుంటారు కొందరు మొండిఘటాలు. అంతేకదండీ కాస్తాంత తెలివిగా ఆలోచిస్తే.. జరిగిపోయే పనులకు కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చిస్తుంటారు. నమ్మశక్యంగా లేదా..? అయితే ఈ సంఘటనను మీరు తెలుసుకోవాల్సిందే. చండీగఢ్ లోని కాన్ వాల్జిత్ వాలియా అనే బడా క్యాటరింగ్ బిజినెస్ యజమాని తాజాగా  హోండా యాక్టివా స్కూటర్ కోన్నాడు. దాని ఖరీదు ఎంతనుకుంటున్నారు. అటుఇటుగా యాభై వేల రూపాయలుంటుంది. అయితే దానిని రోడ్డపై తీసుకురావాలంటే.. ఆ రాష్ట్ర రోడ్డ రవాణ సంస్థ నుంచి జారీ చేయబడిన నెంబరు కావాలి కదా. అందుకని ఆ తతంగాన్ని పూర్తి చేసే సరికి అతగాడికి చేతి చమురు వదిలిందట. అంటే లంచమనుకుంటున్నారా..? కాదు

అతని ఇంట్లో  ఉన్న వాహనాలన్నింటికి కూడా ఫ్యాన్సీ నెంబర్సే ఉన్నాయి. కొత్త వాహనం కొన్న ప్రతిసారి ఫ్యాన్సీ నంబర్ల కోసం వేసే వేలంలో అత్యంత ఎక్కువ రేటు పెట్టి మరీ ఆ నెంబర్లను ఆయన సొంతం చేసుకుంటారు. అచ్చం అలాగే ఈ సారి కూడా లైసెన్స్ అథారిటీ వేసిన వేలంలో తాను కొన్న కొత్త హోండా యాక్టివా స్కూటర్ నంబర్ కోసం అక్షరాల రూ.8.1లక్షలు పెట్టి సీహెచ్ 1బీసీ 0001 అనే నెంబర్ ను సొంతం చేసుకున్నాడు. కేవలం రూ.50 వేలు పెట్టి కొనుగోలు చేసిన వాహనానికి అంతపెద్దమొత్తంలో పెట్టి నెంబర్ కొనుగోలు చేయడంతో అంతా అవాక్కయ్యారు. అంతకు ముందే తన కుమారుడు కొన్న బైక్కు కూడా సీహెచ్01బీసీ0011 అనే నెంబర్ కోసం రూ.2.6 లక్షలు వెచ్చించారు. అంతేమరి డబ్బున్న మారాజులకు దేనికి మాత్రం కోదవుంటుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandigarh  Honda Activa  Fancy number  VIP Number  

Other Articles