Black money | Loksabha | Arun jaitly

The black money bill passed in the loksabha

Black money, Loksabha, Modi, Arun jaitly

The black money bill passed in the loksabha. financial minister arun jaitly propose the black money bill and he descibed about the bill loksabha.

నల్లధనంపై లోక్ సభలో బిల్ పాస్

Posted: 05/12/2015 08:10 AM IST
The black money bill passed in the loksabha

ఎంతో కాలంగా ఊరిస్తున్న బ్లాక్ మనీపై బిల్ గట్టెక్కింది. నల్లధనం బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దీంతో పన్ను ఎగవేతదారులపై పోరాటానికి మార్గం సుగమం అవుతుంది. విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తిరిగి తేవడం తేలికవడమే కాకుం డా వేగవంతం కూడా అవుతాయని భావిస్తున్నారు. దేశంలోని అక్రమ సొమ్ము గురించి ఈ బిల్లులో ఏమీ లేదని ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి, దీనికి మద్ద తివ్వాలని ప్రతిపక్షాలను కోరారు. నల్లధనాన్ని ఎదు ర్కొనే చర్యల్లో భాగంగా నూతన బినామీ చట్టాన్ని ప్రభుత్వం త్వరలోనే తీసుకొస్తుందన్నారు. విదేశాల్లో నల్ల ధనం పోగేసుకున్నవారిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానా, 120 శాతం వరకు పన్ను విధించేందుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుందని తెలిపారు.

ఈ బిల్లును స్థాయీ సంఘానికి పంపించాలని ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌ను జైట్లీ తిరస్కరించారు. దీనిని ఆమోదించడంలో జాప్యం జరిగితే నేరస్థులు లెక్కల్లో చూపని సంపదను గుర్తు తెలియని ప్రాంతాలకు తరలించే అవకాశం కలుగుతుందని చెప్పారు. నిష్కళంకులుగా బయటపడాలనుకొనేవారికి అంగీకార గడువు (కాంప్లియెన్స్‌ విండో) రెండు భాగాల్లో ఉంటుందన్నారు. ఆస్తులను ప్రకటించి, 30 శాతం పన్ను, 30 శాతం జరిమానా చెల్లించవచ్చునని తెలిపారు. అంగీకార గడువు పూర్తయిన తర్వాత ఏ వ్యక్తికైనా అప్రకటిత విదేశీ సంపద ఉన్నట్లు వెల్లడైతే, ఆ వ్యక్తి 30 శాతం పన్ను, 90 శాతం జరిమానా చెల్లించడంతో పాటు క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. నేరం రుజువైతే గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Black money  Loksabha  Modi  Arun jaitly  

Other Articles