plastic baby | punjab | amritsar

A woman gives birth to a plastic baby

plastic baby, punjab, amritsar, doctors, baby, genetics, mutation

Ever heard about a "plastic baby" who looks like a rubber doll and sheds skin like that of reptile scales. A plastic baby born in Amritsar has become the centre of attraction in the region as birth of such babies is rare and occurs once among six lakh newborns. The plastic newborns are scientifically known as collodion babies.

అమ్మకు పుట్టింది ప్లాస్టిక్ బొమ్మ

Posted: 05/11/2015 03:40 PM IST
A woman gives birth to a plastic baby

ఏంటీ.. అమ్మకు ప్లాస్టిక్ బొమ్మ పుట్టింది అని రాస్తే ఎక్కడో డౌట్ వచ్చే ఉంటుంది. కానీ అనుమానం ఏమీ అవసరం లేదు దానికి క్లారిటీ ఇస్తాం..కొంత మందికి అవయవాలు సరిగా లేని శిశువులు పుట్టారని, జంతువులను పోలిన శిశువులు పుట్టారని కూడా విన్నాం.. కానీ ఇలా ప్లాస్టిక్ బొమ్మ పుట్టడం ఏంటో వింత. అయినా ప్లాస్టిక్ బొమ్మ పుట్టింది అంటే నిజంగా ప్లాస్టిక్ కాదు అచ్చు ప్లాస్టిక్ బొమ్మ ఎలా ఉంటుందో అలాగే ఓ శిశువు పుట్టింది. పంజాబ్‌లో ఇదో విచిత్ర ఉదంతం. అక్కడ ఓ మహిళకు ప్లాస్టిక్ బేబీ పుట్టింది. అమృత్‌సర్‌లో రాజసాన్సీ ప్రాంతానికి చెందిన ఓ మహిళ శుక్రవారం ఈ విచిత్రమైన శిశువుకు జన్మనిచ్చింది. గురునానక్ దేవ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో రబ్బర్ బొమ్మలా పుట్టిన ఈ శిశువును చూసి డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ప్రతి ఆరు లక్షలమంది చిన్నారుల్లో ఒకరు ఇలా అరుదైన వింత లక్షణాలతో పుడతారని వారంటున్నారు.

ఈ పాప తల్లినుంచి పాలు తీసుకోలేకపోతోందని వాళ్ళు చెప్పారు. ఈ శిశువు ముఖం, పెదవులు ఎర్రగా ఉన్నాయని, చర్మం పొలుసులతో కూడిన చేప తరహాలో ఉందని ఓ డాక్టర్ అన్నారు. ముట్టుకోగానే ఈ శిశువు ఏడుస్తోందని ఆయన తెలిపారు. జన్యుపరమైన లోపాలవల్ల ఇలా వింత శిశువులు పుడుతున్నట్టు ఆయన చెప్పారు. అయితే కొంతమందిలో సుమారు 15 రోజులనుంచి 30 రోజుల్లోగా చర్మం మామూలుగా మారి చిన్నారులు సాధారణ రూపులోకి మారే అవకాశాలు ఉన్నాయట.. ఇలాంటివారికి ఇన్ఫెక్షన్ త్వరగా సోకి ప్రమాదకర స్థాయికి చేరి ప్రాణాంతకంగా మారవచ్చునని కూడా అంటున్నారు. కాగా కొన్నేళ్ళ క్రితం పంజాబ్‌లోనే ఓ మహిళకు దాదాపు ఇలాంటి లక్షణాలతోనే  ఆడ శిశువు పుట్టి మూడు రోజుల్లో మరణించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : plastic baby  punjab  amritsar  doctors  baby  genetics  mutation  

Other Articles