bjp playing double games on ap special status critisizes congress

Congress ready to support if bjp includes ap special status into bill

bjp can includes ap special status into bill, bjp playing double games on ap special status, congress, former union minister JD Sheelam, special status to AndhraPradesh, AndhraPradesh special status issue, union minister venkaiah naidu, AndhraPradesh, special status issue, dont politicalise special status issue,

former union minister JD Sheelam counters, union minister venkaiah naidu comments on AndhraPradesh special status issue, says congress ready to support, if bjp includes ap special status into bill

మేం రెడీ.. మరి మీరు..? వెంకయ్య వ్యాఖ్యలపై కాంగ్రెస్ కౌంటర్

Posted: 05/07/2015 03:11 PM IST
Congress ready to support if bjp includes ap special status into bill

ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రోజుకో మాట మాట్లాడుతూ.. తప్పంతా తమ పార్టీపై నెట్టేందుకు యత్నిస్తున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనను చేసిన యూపీఏ ప్రభుత్వం.. రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదాకు చట్టబద్ధత కల్పించి ఉంటే ఇప్పుడు సమస్య వచ్చేది కాదని వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకయ్యనాయుడి వ్యాఖ్యలను ఆయన తప్పికోట్టారు.

ప్రత్యేక హోదాపై బీజేపీ తుచ్చ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. భద్రాచలం డివిజన్ లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ.. నిర్ణయం తీసుకున్న ఎన్డీఏ ప్రభుత్వానికి.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని చట్టబద్దట చేయడం కష్టంగా పరిణమించిందా అని ఆయన నిలదీశారు. చట్టంలో ప్రత్యేకహోదా అంశాన్ని చేర్చడానికి కాంగ్రెస్‌ సిద్ధం....బీజేపీ సిద్ధమా అని ఆయన సవాల్‌ విసిరారు. చట్టంలోని మిగతా హామీలనైనా బీజేపీ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నవ్యంద్ర నుంచి బీజేపీ, టీడీపీని తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు. బీజేపీ మాట నిలబెట్టుకోకుండా ఏపీకి వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. బీహార్‌ ఎన్నికల కోసం ఏపీకి బీజేపీ అన్యాయం చేస్తోందని జేడీశీలం ఆరోపించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : venkaiah naidu  JD Sheelam  special status  Andhra Pradesh  

Other Articles