isis | hyderabad | students

Fourteen students stopped at airport from joining islamic state

isis, hyderabad, students, join, airport, police, ib

In a significant development, fourteen students, who were en route to Syria and Iraq to join Islamic State (IS), were stopped at Hyderabad airport. The state as well as central intelligence agencies started verification of students with suspicious links after an engineering student from Hyderabad, who joined IS, died fighting in Syria.

ఐఎస్ఐఎస్ లోకి హైదరాబాదీలు?.. 14 మంది అరెస్ట్

Posted: 05/06/2015 11:07 AM IST
Fourteen students stopped at airport from joining islamic state

అంతర్జాతీయంగా రక్తపాతాన్ని సృష్టిస్తోన్న ఐఎస్ఐఎస్.. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కలవరాన్ని రేపుతోంది. హైదరాబాద్ నుండి దాదాపు 14 మంది విద్యార్థులు ఐఎస్ఎస్ లో చేరడానికి ప్రయత్నిస్తున్నారని. సమాచారం అందుకున్న పోలీసులు వారిని విమానాశ్రయంలో అడ్డుకున్నారు. అయితే తాజా పరిణామంతో తెలంగాణ, ఏపిలో కూడా ఐఎస్ఐఎస్ కార్యకలాపాలు జరుగుతున్నాయా.. ఇక్కడి నుండి రిక్రూర్ మెంట్ జరుగుతోందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే తాజాగా సిరియాలో ఐఎస్ఐఎస్ పోరాటంలో చనిపోయిన తెలంగాణ కుర్రాడు హఫీజ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతను ఇక్కడ కొంత మంది విద్యార్థులను ఐఎస్ఐఎస్ కోసం రిక్రూట్ చేశారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.

సిరియా, ఇరాక్ ఇస్టామిక్ స్టేట్ లో జాయిన్ కావడానికి అన్ని దేశాల నుండి రిక్రూట్ మెంట్ నడుస్తోంది. అందులో భాగంగా భారతదేశం నుండి మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుండి నియామకాలు జరుగుతున్నాయని నిఘా వర్గాలకు పక్కా సమాచారం అందింది. అందులో భాగంగా దాదాపు ఐఎస్ఐఎస్ లో చేరడానికి బయలుదేరిన 14 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారికి కౌన్సిలింగ్ నిర్వహించిన అధికారులు ఐఎస్ఐఎస్ కార్యకలాపాలపై ఆరా తీస్తున్నారు. అయితే ఐఎస్ఐఎస్ లో చేరదామని అనుకున్న విద్యార్థులు వేరు వేరు ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుండటం పోలీసులకు అనుమానాలు కలిగిస్తోంది. అసలు రిక్రూర్ మెంట్ ఎలా చేశారు, ఎవరు చేశారు, ఇంకా ఎంత మందిని చేశారు అన్న కోణంలో పోలీసులు, నిఘా వ్యవస్థ దృష్టి సారించింది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  hyderabad  students  join  airport  police  ib  

Other Articles