Adilabad |Manchiryal | Hafeez | ISIS

Adilabad dist manchiryal student joined in isis

Adilabad, Manchiryal, Hafeez, ISIS

Adilabad dist manchiryal student joined in isis. Telangana state adilabad dist. manchiryal hafeez joined in terrorist union ISIS. his family members scared to reveal the details of hafeez.

ఐఎస్ఐఎస్ లో తెలంగాణ కుర్రాడు

Posted: 05/04/2015 07:52 AM IST
Adilabad dist manchiryal student joined in isis

తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన ఎంఎస్ విద్యార్థి ఒకరు విదేశాల్లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాల్లో పాల్గొంటూ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది. నిఘావర్గాల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ విద్యార్థి కుటుంబీకులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంచిర్యాలకు చెందిన హఫీజ్ అనే విద్యార్థి ఎంఎస్ చదివేందుకు మూడేండ్ల క్రితం అమెరికా వెళ్లాడు. అక్కడ ఆన్‌లైన్, సోషల్ మీడియా ద్వారా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదులతో సంబంధాలు పెంచుకున్నాడు. తర్వాత పలు దేశాల్లో ఆ సంస్థ కార్యకలాపాల్లో నేరుగా పాల్గొని ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డాడని నిఘా వర్గాలకు సమాచారం వచ్చింది. ఈ విషయాలేవీ కుటుంబీకులకు, బంధువులు, స్నేహితులకు తెలియదు.

నాలుగునెలల క్రితం హఫీజ్ స్వస్థలం మంచిర్యాలకు వచ్చాడు. తల్లిదండ్రుల కోరిక మేరకు ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరిగిన తర్వాత అమెరికా వెళ్లిపోయాడు. మార్చి 15న తల్లిదండ్రులకు ఐఎస్‌ఐఎస్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. కాల్పులు, ఎదురుకాల్పుల్లో హఫీజ్ చనిపోయాడని వారు సమాచారం అందించారు. అయితే ఈ విషయాన్ని కుటుంబీకులు బయటకు పొక్కనివ్వలేదు. చదువుకునేందుకు వెళ్లిన కొడుకు ఉగ్రవాద సంస్థలో చేరుతాడని అనుకోలేదని వారు చెప్తున్నా నిఘా వర్గాలు మాత్రం హఫీజ్ ఐఎస్‌ఐఎస్‌లో చేరిన విషయం కుటుంబీకులకు తెలుసని అంటున్నాయి.

హఫీజ్ మరణించిన విషయం గప్‌చుప్‌గా ఉంటుందని కుటుంబీకులు భావించినా నిఘా వర్గాలు పసిగట్టాయి. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ బ్యూరో, దర్యాప్తు సంస్థలు, నిత్యం వివిధ దేశాల్లోని దర్యాప్తు సంస్థలతో టచ్‌లో ఉండే నిఘావర్గాల సమాచార విశ్లేషణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. రెండురోజుల క్రితం ఈ విషయాన్ని రాష్ట్ర నిఘావర్గాలకు తెలియ చేయడంతో వారు హుటాహుటిన హఫీజ్ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. హఫీజ్ ఐఎస్‌ఐఎస్ సానుభూతిపరుడిగా ఎప్పుడు మారాడు? ఏయే దేశాల్లో కార్యకలాపాలు సాగించాడన్న సమాచారాన్ని సేకరిస్తున్నారు.

 

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adilabad  Manchiryal  Hafeez  ISIS  

Other Articles