eamcet exam to be held on may 14th and may 24th eamcet results will be released

Eamcet for telangana students on may 14

EAMCET for Telangana students on May 14, Eamcet exam, Ramana rao, Eamcet results, Engineering exams, JNTUH, telangana eamcet on may 14th, telangana eamcet results on 24th, eamcet key on 18th may,

telangana eamcet exam to be held on may 14th and may 24th eamcet results will be released

మే 14న ఎంసెట్ పరీక్ష..నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

Posted: 05/03/2015 09:27 PM IST
Eamcet for telangana students on may 14

తెలంగాణలో మే 14న ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ రమణారావు పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఎంసెట్‌-2015 విధివిధానాలను రమణారావు వెల్లడించారు. ఈ నెల 18న ఎంసెట్ కీ, 24న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. అయితే ఎంసెట్ పరీక్షల నిర్వహణలో భాగంగా ఇంజినీరింగ్ పరీక్షకు 251 సెంటర్లు, మెడికల్ అండ్ అగ్రికల్చరల్ 172 సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. హైదరాబాద్ను 8 జోన్లుగా విభజించి విద్యార్థులను సమీప ప్రాంతంలోనే ఎంసెట్ పరీక్ష సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నామని రమణారావు తెలిపారు.

14న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష, మధ్యాహ్నం 2:30 నుంచి 5 :30 వరకు మెడికల్‌ ఎంసెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. పరీక్షలకు 30 నిమిషాల ముందు అభ్యర్థులు హాజరుకావాలని రమణారావు సూచించారు. ఎంసెట్ పరీక్షలకు నిమిషం అలస్యంగా వచ్చినా.. పరీక్షలు రాసేందుకు విద్యార్థులను అనుమతించమని చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి సెల్‌ఫోన్‌లు, వాచ్‌లు తీసుకురావొద్దని వెల్లడించారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 1.32 లక్షల మంది అభ్యర్థులు హాజరవ్వనున్నారని... 252 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మెడికల్‌ పరీక్ష రాసే 70 వేల మంది అభ్యర్థులకు 172 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Eamcet exam  Ramana rao  Eamcet results  Engineering exams  JNTUH  

Other Articles