5.3 Quake Jolts Andamans, 6.8 In Papua New Guinea

5 4 magnitude earthquake hits andaman and nicobar islands

Andaman and Nicobar, Jolted, Nepal Earthquake, papua new guinea, Tremors, Nepal quake toll could reach 10,000, Nepal PM Sushil Koirala, Disaster, earthquake, epicentre, IMD, India, Indian Meteorological Department, Nepal, PM Narendra Modi, Richter scale, tremors, Varanasi, World

Andaman and Nicobar islands were jolted by a 5.3 magnitude earthquake while a 6.8 magnitude tremors hit off Papua New Guinea on Friday.

అండమాన్ లో స్వల్పంగా, న్యూగినియాల్లో భారీగా భూ ప్రకంపనలు

Posted: 05/01/2015 04:52 PM IST
5 4 magnitude earthquake hits andaman and nicobar islands

నేపాల్‌లో గత శనివారం నుంచి దాదాపు అనేక పర్యాయాలు కంపించిన భూమికి భూతల స్వర్గంగా కోలువుదీరిన హిందూ ఆధ్యాత్మిక దేశం నేపాల్.. శవాల దిబ్బగా మారిన విషాద ఘటనలు ఇంకా కళ్ల ముందు నుంచి వీడకముందే.. అండమాన్ నికోబార్ దీవుల్లోను, పపువా న్యూగినియాలోను ఇవాళ భూ ప్రకంపనలు సంభవించ్చాయి. అండమాన్ నికోబార్ దీవుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదు కాగా, పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో వచ్చింది. పోర్ట్బ్లెయిర్కు 135 కిలోమీటర్ల ఆగ్నేయ దిశలో అండమాన్ భూకంప కేంద్రం ఉందని తెలిసింది.

శుక్రవారం మధ్యాహ్నం 2.30 ప్రాంతంలో ఈ భూకంపం వచ్చినట్లు భారత వాతావరణ శాఖ అధికారి ఒకరు చెప్పారు. భూమికి 10 కిలోమీటర్ల లోతున ఇది వచ్చినట్లు తెలిపారు. అయితే, దీనివల్ల ఎలాంటి ఆస్తినష్టం, ప్రాణనష్టం సంభవించినట్లు మాత్రం సమాచారం లేదు. ఇక పపువా న్యూగినియాలో 7.1 తీవ్రతతో భూకంపం వచ్చింది. కొకోపో నగరానికి ఆగ్నేయంగా 110 కిలోమీటర్ల దూరంలో దీని కేంద్రం ఉంది. ఇదే ప్రాంతంలో 6.7 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే దీనివల్ల సునామీ ముప్పు మాత్రం ఏమీ లేదని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eatth quake Andaman and Nicobar  Jolted  papua new guinea  

Other Articles