Congress | Rahulgandhi | Parliament | Suicide | farmer

Congress vice president rahul gandhi wil attack on govt for farmer suicide at delhi

rahul gandhi, suicide, farmers, bda, parliament, attacks, modi, cabinet, notice

Congress vice president rahul gandhi wil attack on govt for farmer suicide at delhi. Congress party vice president ready to attack on nda govt for farmers suicide at parliament.

రైతు ఆత్మహత్యపై రాహుల్ రచ్చరచ్చ..?

Posted: 04/23/2015 10:38 AM IST
Congress vice president rahul gandhi wil attack on govt for farmer suicide at delhi

రాహుల్ గాంధీ మళ్లీ రెచ్చిపోనున్నారా.. నిన్న జంతర్ మంతర్ వద్ద యువ రైతు ఆత్మహత్య పై ప్రభుత్వాన్ని కడిగేస్తారా అంటే అవుననే సమాధానం వస్తోంది. మొన్న భూసేకర చట్టం, నిన్న నెట్ న్యూట్రాలిటీ మరి నేడు రైతు ఆత్మహత్యపై పార్లమెంట్ లో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయనున్నారు రాహుల్ గాంధీ. రైతు ఆత్మహత్యపై చర్చించాలంటూ విపక్ష సభ్యులు గురువారం ఉదయం రాజ్యసభలో నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వ తీరు వల్లే  రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.  ఈ అంశంపై ఆయన నేడు సభలో ప్రసంగించే అవకాశం ఉంది.  కాగా లోక్సభలోనూ రైతు ఆత్మహత్యపై చర్చ జరిగే అవకాశం ఉంది. మొత్తానికి రాహుల్ గాంధీకి ప్రభుత్వం పై దాడి చెయ్యడానికి ఇలా రోజుకో అంశం దొరకడం కాంగ్రెస్ కు కలిసివచ్చే అవకాశమే. అయితే ప్రతిపక్షాల దాడిని ధీటుగా తిప్పి కొట్టడానికి మోదీ కేబినెట్ కూడా సిద్దంగా ఉందని సమాచారం. మరి నేడు పార్లమెంట్ లో ఏం జరుగుతుందో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi  suicide  farmers  bda  parliament  attacks  modi  cabinet  notice  

Other Articles