Narachandrababu | Celebrated | Birthday

Narachandrababu naidu celebrated his birth day at ntr trust bhavan

narachandrababunaidu, chandrababu, apcm, birthday, Telugupeople

Narachandrababu naidu celebrated his birth day at NTR trust bhavan. Chandrababu naidu entered into 66years. TDP leaders arranged 65kg cake at ntr trust bhavan.

ITEMVIDEOS:ఘనంగా చంద్రబాబు పుట్టిన రోజు వేడుకలు

Posted: 04/20/2015 10:56 AM IST
Narachandrababu naidu celebrated his birth day at ntr trust bhavan

తెలుగు జాతికి తన జీవితం అంకితమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. 66వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు ఎన్టీఆర్‌ట్రస్ట్‌భవన్‌లో ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. కార్యకర్తల సమక్షంగా కేక్‌కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తలు, అభిమానుల ఆశీస్సులే తనకు శ్రీరామరక్ష అని చెప్పారు. మీ త్యాగాల ఫలితంగానే పార్టీ ఈ స్థాయికి వచ్చిందన్నారు. తెలుగు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఏపీని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చంద్రబాబుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, కొల్లురవీంద్ర, రావెల కిషోర్‌బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ, శ్రీకాళహస్తి వేదపండితులు చంద్రబాబును ఆశీర్వదించారు. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్‌ట్రస్ట్‌ భవన్‌లో కంటి, దంత, రక్తదాన శిబిరాలను బాబు ప్రారంభించారు. అలాగే అంధులకు బ్రెయిలీ ల్యాప్‌టాప్‌లను అందజేశారు.

చంద్రబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని తెచ్చిన 65 కిలోల కేక్ను అభిమానులు కట్ చేశారు.రక్తదానం, నేత్రదానం క్యాంపులను ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. కాగా.. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ చంద్రబాబునాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.

modiwishesh-to-chandrababu

నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు వేడుకలు ముగిసిన వెంటనే అనంతపురం పర్యటనకు బయలుదేరారు. అనంతపురంలోని గొల్లపల్లి జలాశయాన్ని సందర్శించి రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. కుంటిమద్ది చెరువులో నీరు-చెట్టు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు.

**అభినవచారి**

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narachandrababunaidu  chandrababu  apcm  birthday  Telugupeople  

Other Articles