police raid lodges in yadagirigutta, councelled 11 youth couples

Police raid against prostution in yadagirigutta

police raid, hyderabad prostitution, prostitution yadigiri, prostitution ladies, police raid prostitution, police council, yadagirigutta, telangana tirupati, prostitution cases andhra pradesh, telangana updates

police raid lodges in yadagirigutta, catch hold of 11 copuples and warns councells them and warns of doing anti social activites in temple city

వీళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి.. వదిలేశారు..

Posted: 04/17/2015 09:10 PM IST
Police raid against prostution in yadagirigutta

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా, శరవేగంగా అడుగులు వేస్తున్న టెంపుల్ సిటీలో.. పోలీసులు సంఘ విద్రోహ శక్తులు చిక్కారు. ఎవరా శక్తులు అనుకుంటున్నారా..? తెలంగాణ తిరుపతి తరహాలో టెంపుల్ సిటీ యాదగిరి గుట్టను అభివృద్ది పర్చేందుకు శరవేగంగా చర్యలు చేపడుతున్న ప్రభుత్వానికి నల్గొండ జిల్లా యాదగిరిగుట్టలోని పోలీసులు కూడా తమ వంతుగా సహకరిస్తున్నారు. అత్యంత పవిత్రమైన, శక్తి కలిగిన మహిమాన్విత పుణ్యక్షేత్రం యాదగిరి ప్రవిత్రను అఫఖ్యాతి పాలు చేసే సంఘవిద్రోహ శక్తులను పట్టుకుని వారికి కౌన్సిలింగ్ ఇచ్చి నచ్చ జెపుతున్నారు. ఇంతకీ వారెవరో తెలుసా..?

సంఘవిద్రోహ శక్తులంటే ఉద్రవాదులో, మరెవరో అనుకోమాకండి.. వాళ్లు వ్యభిచారిణులు. అయితే గతంలో వున్న పాత తరం కాకుండా హంగులు, ఆర్బాలతో కోత్త పుంతలు తోక్కిన వ్యభిచారిణులను పోలీసులు దాడులలో పట్టుకున్నారు. యాదాద్రి లోని పలు లాడ్జీలపై శుక్రవారం పోలీసులు దాడులు చేశారు. 11 జంటలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు. అక్కడ వారికి పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోబోమని సదరు జంటలను హెచ్చరించారు. ఇటీవల కాలంలో యాదగిరిగుట్టలో వ్యభిచారం జోరుగా సాగుతుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Police  Raid  Prostution  yadagirigutta  11 couples  

Other Articles