Heavyrains | Hyderabad | Telangana | Record

Heavy rains bring new record in telanagana which places 78 years ago

rains, hyderabad, telangana, farmers, rainfall, record, summer

heavy rains bring new record in telanagana which places 78 years ago. In telanagana last three days heavy rainfall is going on. The rainfall in hyderabad beat 6.14 cm last time record in 1937 at 6.07cm.

రికార్డ్.. రికార్డ్.. వర్షం తెచ్చింది కొత్త రికార్డ్

Posted: 04/14/2015 09:04 AM IST
Heavy rains bring new record in telanagana which places 78 years ago

రెండు రోజుల క్రితం నుండి వస్తున్న వర్షాలు ఒక్కసారిగా వాతావరణాన్ని మార్చేశాయి. తెలంగాణలో అందునా హైదరాబాద్ లో అయితే చినుగులు పడి చలి పుట్టిస్తున్నాయి. అయితే మండు వేసవిలో పడుతున్న ఈ వర్షాలు ఇప్పుడు కొత్త రికార్డుకు తెర తీశాయి. అదేంటి వర్షం రికార్డ్ సృష్టించడం ఏంటీ అని అనుకోకండి.. ఎందుకంటే 78 సంవత్సరాల తర్వాత ఏప్రిల్ నెలలో 6.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరి ఇది నిజంగా రికార్డేగా మరి.  1937 ఏప్రిల్ 20న.. 24 గంటల వ్యవధిలో 6.07 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదవడం ఇప్పటివరకున్న రికార్డు. ఆ తర్వాత ఇప్పుడు... ఏప్రిల్ 12 ఉదయం 8.30 గంటల నుంచి 13న ఉదయం 8.30 గంటల వరకు 6.14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడంతో పాత రికార్డు బద్ధలయింది. మామూలుగా అయితే ఏప్రిల్ నెలలో మండుటెండలు సాధారణం. కానీ ఇలా అడపాదడపా ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు కురవడం చూశాం.

మామూలుగా అయితే ఏప్రిల్ నెలలో కురిసే వర్షం మొత్తం కేవలం రెండు రోజుల్లోనే నమోదు కావడం మరో రికార్డు. ఇక ఏప్రిల్ నెలను మొత్తం  తీసుకుంటే 1907లో మాత్రం 141 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 2013 ఏప్రిల్ నెలలో 74.5 సగటు వర్షపాతం నమోదైంది. కానీ ఈసారి రెండోవారంలోనే నగరంలో రికార్డు వానలు కురుస్తున్నాయి. ఈనెలాఖరు నాటికి 1907 నాటి రికార్డు కూడా బద్ధలయ్యే అవకాశాలు. మొత్తానికి రికార్డులు బద్దలు కొట్టడానికి ఆ వరుణుడు కూడా రెడీగా ఉన్నాడేమో చూడాలి. అయితే వర్షంతో మాత్రం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లలో తీవ్రంగా పంట నష్టం కలుగుతోంది. ఇక మామిడి పరిస్థితి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. మామిడి కాయలు రాలి పడుతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అసలే మామిడి తక్కువగా ఉందని అనుకుంటున్న సమయంలో ఇలా వర్షం వాటికి నష్టం కలిగిస్తోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rains  hyderabad  telangana  farmers  rainfall  record  summer  

Other Articles