entry tax pay compalsary says high court

Entry tax pay is mandatory says high court

entry tax pay is mandatory says high court, entry tax pay compalsary says high court, Andhra pradesh, Telagana, Entry tax, High court, vehicles, transport account, vehicles crossong inter state boarders,

high court says entry tax is mandatory for all vehicles crossing inter state boarders

వాహనదారులూ.. ఎంట్రీ అవుతున్నారా.. పన్ను కట్టాల్సిందే..

Posted: 04/10/2015 11:42 AM IST
Entry tax pay is mandatory says high court

ఆంధ్రప్రదేశ్ వాహనాదారులకు హైకోర్టులో చుక్కెదురైంది. ఇరు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్న వాహనాలు ఎంట్రీ టాక్స్ ను ఖచ్చితంగా కట్టితీరాల్సిందేనంటూ రాష్ట్రోన్నత కోర్టు తీర్పును వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వాహనాలు తెలంగాణలోకి ప్రవేశించడం పట్ల వసూలు చేస్తున్న పన్ను (ఎంట్రీ టాక్స్) విధానాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రోన్నత కోర్టును ఆశ్రయించిన వాహనదారులకు ఎదురు దెబ్బ తగిలింది. ఎంట్రీ టాక్స్ ను విధించాల్సిందేనని రష్ట్రోన్నత న్యాయస్థానం తీర్పును వెలువరించింది.అంతర్ రాష్ట్ర పన్ను విధానంపై దాఖలైన పిటీషన్ ను విచారించిన హైకోర్టు.. ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఈ విధంగా వసూలయ్యే మొత్తం పన్ను డబ్బును బ్యాంకుల్లో జమచేయాల్సిందిగా సూచించింది. ఈ డబ్బును ఎలాంటి అవసరాలకు వినియోగించకూడదని స్పష్టం చేసింది.

బ్యాంకుల్లో హామీ పత్రలాలకు బదులుగా వసూలైయ్యే నగదునే జమచేయాలని ఆదేశించింది. రవాణా కమిషనర్ పేరుతో బ్యాంకు ఖాతా తెరిచి ఆ ట్యాక్స్ను వాహన యజమానులు బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలని సూచించింది వాహన యాజమానులు కూడా బ్యాంకుల్లో డబ్బును జమచేస్తే చాలునని చెప్పింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాఖు వచ్చే వాహనాలకు ఎంట్రీ ట్యాక్స్ను వసూలు చేయటంపై 280మంది వాహనదారులు  న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, వారికి మాత్రమే ఈ తీర్పు వర్తిస్తందని కోర్టు స్పష్టం చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra pradesh  Telagana  Entry tax  High court  

Other Articles