BJP MP's Brother in Chhattisgarh Runs SUV Over School Director

Bjp mp s brother absconding after he allegedly runs his vehicle over school director

BJP MP's brother absconding, BJP MP Ranjvijay Singh Judeo brother absconding, BJP MP's brother Vikramaditya Singh Judeo flees, Vikramaditya Singh attacked a private school's director., Vikramaditya accused of two cases, Vikramaditya accused of abduction and keeping two minor children as slaves,

In a shocking incident in the Jashpur district of Chattisgarh, the brother of the local BJP MP Ranjvijay Singh Judeo has been declared absconder after he allegedly attacked a private school's director.

ఆ ఎంపీ సోదరుడు సమాచారం అందిస్తే.. రూ. 5 వేలు..

Posted: 04/08/2015 07:29 PM IST
Bjp mp s brother absconding after he allegedly runs his vehicle over school director

ఆయన స్వయంగా పార్లమెంటు సభ్యుడు. అందునా అధికార బీజేపి పార్టీ నుండి... ఆయన ఎవరంటారా..? ఆయన పేరు రాంజ్ విజయ్ సింగ్ జుడో.. ఆయన తమ్ముడు విక్రమాదిత్య సింగ్ జూడో అచూకీ తెలిపినా, సమాచారాన్ని అందించినా.. అక్కడి పోలీసులు ఐదు వేల రూపాయల రివార్డను అందిస్తారట. అదేంటి నమ్మశక్యంగా లేదా. .? కానీ ఇది నిజం. రంజ్ విజయ్ సింగ్ సోదరుడు విక్రమాదిత్యపై రెండు వేర్వేరు కేసులు నమోదైన నేపథ్యంలో అతడిని పట్టుకుని కోర్టులో హాజరుపర్చేందుకు పోలీసులు చేసిన అన్ని ప్రయత్నాలు విపలమయ్యాయి. దీంతో ఆయన ఆచూకీ చెబితే రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.

ఇంతకీ ఆయన చేసిన నేరాలు ఏమిటంటారా..? ఐదేళ్ల క్రితం బలవంతంగా భూములను అక్రమించడంతో పాటు ఇద్దరు మైనర్ బాలురను పనిలో పెట్టుకున్న కేసులో ఎంపీ సోదరుడు నిందితుడు. అయితూ ఐదేళ్లుగా అదృశ్యంగా వున్న విక్రమాదిత్య తాజాగా ఓ పాఠశాల యజమానితో తలపడ్డాడు. బలవంతంగా భూములను అక్రమించకునేందుకు స్థానిక ప్రైవేటు పాఠశాల యజమాని పరమేశ్వర్ గుప్తాపై నుంచి కారు నడిపించి అతడిని హత్య చేసేందుకు కూడా యత్నించాడు. ఈ ఘటనలో అతనితో పాటు అతని ఇద్దరు అనుచరులపై కూడా కేసులు నమోదయ్యాయి. బరమేశ్వర్ గుప్తాపై హత్యయత్నం కింద కేసు నమోదైనప్పటి నుంచి సదరు నిందితుడు పరారీలో వున్నాడు. బరమేశ్వర్ కు చెందిన భూమి తన పూర్వికులకు సంబంధించినదంటూ వాగ్వాదానికి దిగిన విక్రమాదిత్య అతనిపై నుంచి వేగంగా కారును పోనిచ్చాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బరమేశ్వర్ ను జాష్ పూర్ జిల్లా అస్పత్రిలో చేర్చి.. అక్కడి నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీలోని సూపర్ స్పెషాలిటీ అస్పత్రికి తరలించారు. దీంతో స్థానికులు అందించిన సమాచారం మేరకు కేసు నమోదు  చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐదేళ్లుగా అధృష్యమైన వ్యక్తి వచ్చి అఘాయిత్యాలకు ఎలా పాల్పడుతున్నాడని పోలీసులపై కూడా విమర్శలు రేకెత్తుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jashpur  chattisgarh  ranjvijay singh judeo  vikramaditya singh judeo  

Other Articles