teachets booked under modesty case of a woman and 49 students

Government teachers held for sexually harassing students

government teachers held for sexually harassing students, crime on women, violence on women, sexual harassment on women, government teachers fo maharastra, maharastra government teachers, case against two government teachers,

Two government school teachers were booked on charges sexually harassing a woman and 49 girl students

కీచక గురువులు.. 49 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు..

Posted: 04/03/2015 08:23 PM IST
Government teachers held for sexually harassing students

ఉపాద్యాయులుగా సమాజానికి మార్గదర్శకంగా నిలవాల్సింది పోయి.. వారే దారుణాలకు ఒడిగడితే.. సభ్య సమాజం తలదించుకునేలా కీచక గురువులై కూతుళ్ల వయస్సున్న విద్యార్థినులపై లైంగిక వూదింపులకు పాల్పడితే.. వారిని ఏమనాలి. బావి తరాలకు బంగారు బాటలు వేసి నడిపించాల్సిన గురువులు.. మార్కులు వేస్తామని సాకును ఎరగా చూపి ఏకంగా 49 మంది పాఠశాల విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

మహారాష్ట్రలోని అకోలాలో వున్న జవహర్ నవోదయ విద్యాలయం ఉపాధ్యాయులుగా కోనసాగుతున్న ఇద్దరు ప్రాక్టికల్స్ లో మార్కులు వేయాలంటే.. తాము చెప్పినట్టు నడుచుకోవాలని.. లైంగిక వేదింపులకు పాల్పడ్డారని విద్యార్థినులు ఆరోపించారు. వీరి వేధింపులు భరించలేక ఓ విద్యార్థరిని మహారాష్ట్ర మహిళా కమిషన్ సభ్యులు ఆశా మిర్జాకు ఫిర్యాదు చేశారు. ప్రాక్టికల్ పరీక్షల్లో మార్కులు వేయమని బెదిరింపులకు గురిచేసిన కెమెస్ట్రీ, బయోలజీ ఉపాధ్యాయులు తనపై చాలా కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత విద్యార్థిని పిర్యాదు చేసింది.. తమతో శరీరక సంబంధం ఏర్పర్చుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేసింది

కాగా మరికోందరు విద్యార్థులు ఈ విషయమై ప్రిన్సిపాల్ రామావతార్ సింగ్ ఫిర్యాదు చేశారు. ఆయన పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేసి నిందిత ఉపాధ్యాయులపై విచారణ చేపట్టారు. కాగా, తమ ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని కూడా నిందిత ఉపాధ్యాయులు ఒత్తడి తెచ్చారని బాధిత విద్యార్థినులు తెలిపారు. చివరకు ప్రధానోపాధ్యుడు రామావతార్ సింగ్ పిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా, కీచక ఉపాధ్యాయుల విషయం తెలుసుకున్న విద్యార్థినుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్ అరుణ్ షిండే, సంజయ్ ఖడ్సే, మహిళా కమిషన్ సభ్యులు ఆశా మీర్జే నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharashtra  students  school  teachers  

Other Articles