Suryapet | Firing | Police

Unknown persons open firing on police men at suryapet bus stand

suryapet, firing, police, highway, up, uattrpradesh, bus stand, bihar

Dacoints open unprecidented fire on police men who are conducting routine road check up at Suryapet Bus Stand. The incident happend in midnight. As per initial identification, police believe the decoits are from Uttar Pradesh who involves in many crimes in state.

సూర్యాపేటలో కాల్పుల కలకలం.. పోలీసులపై కాల్పులు జరిపిన దుండగులు

Posted: 04/02/2015 08:45 AM IST
Unknown persons open firing on police men at suryapet bus stand

నల్లగొండ జిల్లా సూర్యాపేటలో పోలీసులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. హై టెక్ బస్టాండ్ సమీపంలో ఈ ఘటనలో కానిస్టేబుల్ లింగయ్యతో పాటు హోంగార్డు మహేశ్ అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పులలో సీఐ మొగిలయ్యతో పాటు అరవింద్, హోం గార్డు కిశోర్ తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో మొగిలయ్య, ఆయన గన్ మన్ కిశోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైవేపై పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

సూర్యాపేట బస్ స్టాండ్ లో తనిఖీ చేస్తుండగా పోలీసులపై దుండగులు పాయింట్ బ్లాంక్ లో కాల్పులకు తెగబడినట్లు తెలుస్తోంది. దుండగులు నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు. సంఘటన స్థలంలో ఒక ఓటరు కార్డు లభించడంతో ఇది ఒడిశా దొంగల ముఠా పని కావచ్చనని అనుమానిస్తున్నారు. అయితే పోలీసుల దృష్టిని మళ్లించేందుకే దుండగులు ఓటరు కార్డును వదిలి వెళ్లారా? అన్న కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది. దుండగులు కానిస్టేబుల్ కార్బన్ వెపన్ ను ఎత్తుకుపోయినట్లు కూడా తెలుస్తోంది. ఘటనలో ఇద్దరు దుండగులు పాల్గొన్నట్లు సమాచారం.

దుండగులు పోలీసులపై కాల్పులు జరిపి పారిపోయే యత్నంలో హైవేపై హైదరాబాద్ వెళుతున్న ఒక కారును ఆపేందుకు ప్రయత్నించారు. అయితే కారు ఆపక పోవడంతో కారులో ఉన్న దంపతులపై కూడా వారు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పశ్చిమ గోదావరి జిల్లా జగన్నాథపురానికి చెందిన దొరబాబు భూజానికి తీవ్రగాయమైంది. కాల్పుల సమాచారం అందిన వెంటనే హైదరాబాద్ రేంజ్ ఐజీ నవీన్ చంద్, జిల్లా ఎస్పీ ప్రభాకర రావు సూర్యాపేట వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ ఘటనలో సీసీ టీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ముమ్మర తనిఖీలు చేపట్టారు. కాల్పులలో తీవ్రంగా గాయపడిన సీఐ మొగిలయ్య మూడు నెలల కిందటే సూర్యాపేటకు బదిలీపై వచ్చారు. ఆయన అరెస్టు చేసిన రెండు బిహారీ ముఠాలే ఈ కిరాతకానికి పాల్పడ్డాయని పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. ముఠాలో తప్పించుకున్న ఇద్దరు ఈ దురాగతానికి పాల్పడ్డారని చెబుతున్నారు. ఇది దొంగల యుపి ముఠాల పని కావచ్చునని కూడా అనుమానాలున్నాయి.

Video Courtesy : TV5

ఇర్ఫాన్ అనే వ్యక్తి సూర్యాపేట బస్టాండ్ లో కాల్పులకు పాల్పడిన దుండగులలో ఒకడయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, ఇతడు ఉత్తరప్రదేశ్ లోని మీరట్ ప్రాంతానికి చెందినవాడని భావిస్తున్నారు. ఇతనికి ఈ ఘటనతో ఏమైనా సంబంధం ఉందేమోన్న కోణంలో పోలీసుల దర్యాప్తు చేస్తామని తెలిపారు. దుండగుల కాల్పుల్లో గాయపడిన సీఐ మొగులయ్యతో పాటు ఓ గన్మెన్ ప్రస్తుతం హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు నక్సల్స్ దాడులకు పాల్పడ్డారా అనే కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : suryapet  firing  police  highway  up  uattrpradesh  bus stand  bihar  

Other Articles