I m upset but truth will come out manmohan

Summons to Manmohan Singh, Kumar Mangalam Birla letter to Manmohan Singh, PC Parakh role in Coal Scam, CBI special Court, Coalgate Investigating CBI Court Summons Former PM, Manmohan Singh summoned, Manmohan Singh summonned in coal scam, coal blcok allocation scam, PC Parakh, Hindalco

Former prime minister Manmohan Singh on Wednesday said he was "upset" at being summoned as accused by a special court in a coal block allocation scam case.

కలత చెందాను.. కానీ.. నిజాలు వెలుగులోకి వస్తాయి..

Posted: 03/11/2015 08:16 PM IST
I m upset but truth will come out manmohan

కోర్టు సమన్లు అందుకోవడంతో తాను కలత చెందానని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. అయితే జీవితంలో ఇదీ ఓ భాగంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీచేయడంపై మాజీ ప్రధాని మన్మోహన్ స్పందించారు. ఈ కేసులో తన వాదనను, వాస్తవాలను న్యాయస్థానం ముందు పెడతానని, సత్యం విజయం సాధిస్తుందని నమ్ముతున్నానన్నారు. కోర్టు నోటీసులు రావడంతో అప్ సెట్ అయిన మాట నిజమేనన్నారు. తాను న్యాయ వ్యవస్థను గౌరవిస్తానని,  ఇప్పటికే  తన వైఖరిని  సీబీఐకి  స్పష్టం చేశామన్నారు. ఇదొక మంచి అవకాశం..న్యాయ విచారణ కు తానెప్పుడూ సిద్ధమన్నారు. దీనిపై లీగల్ కౌన్సిల్ లో చర్చిస్తామని చెప్పారు.

మన్మోహన్‌తో పాటు కుమారమంగళం బిర్లా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి పరేఖ్, మరో ముగ్గురికి సమన్లు జారీ అయ్యాయి. ఏప్రిల్ 8న విచారణకు హాజరు కావాలని ప్రత్యేక కోర్టు వారిని ఆదేశించింది. ఇదిలా ఉంటే సీబీఐ ప్రత్యేక కోర్టు  సమన్లు జారీ చేయడం పై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కాంగ్రెస్ చేసిన పాపానికి మన్మోహన్ శిక్ష అనుభవిస్తున్నారని కేంద్రమంత్రి  ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. దీనిపై జాతికి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలన్నారు.  ఇది కాంగ్రెస్ పార్టీపై మరో మరక. ఆ పార్టీని సమర్ధిస్తున్న మిగతా పార్టీలన్నీ ఇప్పటికైనా పునరాలోచించుకోవాలని ఆయన  జావదేకర్ అన్నారు.

బీజేపీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ మనీష్ తివారి మాట్లాడుతూ మన్మోహన్  చాలా పారదర్శకంగా. నిజాయితీగా వ్యవహరించారని పేర్కొన్నారు.  దీనిపై న్యాయపోరాటం చేస్తామన్నారు. బొగ్గు కేటాయింపులను పరిశీలించిన సుప్రీంకోర్టు డా. మన్మోహన్ కు వ్యతిరేకంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదని గుర్తు చేశారు.  మన్మోహన్ సింగ్ తప్పులు చేసి వుంటారన్న విషయంలో యావత్ దేశం వ్యతిరేకిస్తుందని మరో కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ అన్నారు. మరోవైపు మాజీ కోల్ కార్యదర్శి పీసీ పరాక్  సమన్లపై ఆశ్యర్యవ్యక్తం చేశారు.  దీనిపై ఇపుడు  తానేమీ మాట్లాడలేనన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manmohan Singh  coal blcok allocation scam  Kapil Sibal  Manish Tewari  

Other Articles