Eetala rajender budget rs 1 15 689

eetala rajender tables first year long budget, Eetala first year long budget, telangana budget 2015-16, Telangana finance minister eetala rajender, telangana budget, Telangana Assembly,

eetala rajender tables first year long budget for the year 2015-16 today in Telangana Assembly

రూ.లక్షా 15వేల 689 కోట్లుతో తెలంగాణ బడ్జెట్..

Posted: 03/11/2015 10:45 AM IST
Eetala rajender budget rs 1 15 689

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 15వేల 689కోట్లని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. 2015-16 సంవత్సరానికి బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తంలో ప్రణాళిక వ్యయం 52 వేల 383 కోట్ల రూపాయలు కాగా, ప్రణాళికేతర వ్యయం 63 వేల 306 కోట్ల రూపాయలుగా ఆయన తెలిపారు. ఈ సారి బడ్జెట్ లో ద్రవ్యలోటుగా రూ. 16 వేల 969 కోట్ల రూపాయలను చూపిన ఈటెల అర్థిక మిగులు బడ్జెట్ ను  531 కోట్ల రూపాయలను అర్ధిక మిగులుగా ఆయన చూపారు.

ప్రభుత్వం త్వరలో గ్రేటర్ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో గ్రేటర్ వాసులను ప్రసన్నం చేసుకునేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు తాజా బడ్జెట్‌లో రూ.526 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి రాజేందర్ అన్నారు. నగరంలో ఆకాశ మార్గాల నిర్మాణాలకు 1600 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ ఏడాది చివరినాటికి హైదరాబాద్‌కు 170 ఎంజీడీల నీటి సరఫరా చేసేందుకు కూడా బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయల నిధులను కేటాయించారు. హైదరాబాద్ ప్రజల అవసరార్థం నిర్మిస్తున్న ప్రజా రవాణ వ్యవస్థ మెట్రో రైలుకు బడ్జెట్ లో రూ. 416 కోట్లు ఇచ్చారు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయకు బడ్జెట్‌లో రూ.2,803 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మిషన్ లో భాగంగా 9వేల 308 చెరువులను పునరిద్దరించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకు గాను రోడ్లు భవనాల శాఖకు రూ. 4980 కోట్ల రూపాయలు, పంచాయితీ రాజ్ శాఖ రూ 2, 421 కోట్ల రూపాయలను కేటాయించారు. అదే సమయంలో తెలంగాణలోని టెంపుల్ సిటీ యాదాద్రికి అభివృద్ది కోసం దేవాలయ అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇందుకుగాను ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు పెట్టామన్నా ఆర్థిక మంత్రి ఈటెల... మరో రూ.వంద కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు..


* రాష్ట్ర బడ్జెట్ రూ.లక్షా 15వేల 689 కోట్లు.
* ప్రణాళిక వ్యయం రూ. 52వేల 383 కోట్లు.
* ప్రణాళికేతర వ్యయం రూ.63వేల 306 కోట్లు
* రాష్ట్ర ఆర్థిక మిగులు రూ.531 కోట్లు
* ద్రవ్యలోటు రూ. 16,969 కోట్లు
* రుణమాఫీ కోసం రూ.4,800కోట్లు
* పేద యువతుల వివాహం కోసం కల్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టాం.
* రాష్ట్ర విద్యుత్ రంగం పునరుద్ధరణకు తొలి అడుగులు పడ్డాయి.
* మరో రూ.4వేల కోట్లు అప్పు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని కోరాం.
* జీహెచ్ంఎసీకి రూ.526కోట్లు
* ఆకాశ మార్గాలకు రూ.1600 కోట్లు
* ఈఏడాది చివరినాటికి హైదరాబాద్‌కు 170 ఎంజీడీల నీటి సరఫరా
* యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి సంస్థ ఏర్పాటు
* యాదగిరిగుట్టకు ఇప్పటికే రూ.100 కోట్లు ఖర్చు పెట్టాం.. మరో రూ.వంద కోట్లు కేటాయింపు
* మిషన్ కాకతీయకు రూ.2,083కోట్లు
* ఈ ఆర్థిక సంవత్సరంలో 9,308 చెరువుల పునరుద్ధరణ
* రోడ్లు భవనాల శాఖకు రూ.4,980కోట్లు
* పంచాయతీరాజ్‌శాఖకు రూ.2,421 కోట్లు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eetala rajender  budget 2015-16  Telangana Assembly  

Other Articles