Delhi high court upholds conviction of chautala

Delhi High Court upholds conviction of Chautala, Delhi High Court, Delhi HC, teachers recruitment scam, inld party ringtone, inld party join, inld party candidate list, inld party songs, inld party chief om prakash chautala, nld party logo, inld party latest news, inld party image, inld party latest updates, Abhay Singh Chautala, former Haryana Chief Minister Om Prakash Chautala,

The Delhi High Court upheld the conviction of former Haryana Chief Minister Om Prakash Chautala and his son along with 53 others in the teachers recruitment scam.

ఢిల్లీ హైకోర్టులో ఓం ప్రకాష్ చౌతాలకు చుక్కెదురు..

Posted: 03/05/2015 02:03 PM IST
Delhi high court upholds conviction of chautala

హర్యానా మాజీ ముఖ్యమంత్రి. ఐ.ఎన్.ఎల్.డి పార్టీ అధినేత ఓం ప్రకాష్ చౌతాలాకు మరోమారు చుక్కెదైంది., ఈ సారి ఆయనతో పాటు ఆయన కుమారుడికి ఢిల్లీ హైకోర్టులో చెకెదురైంది. ఉపాధ్యాయుల నియామకం కుంభకోణం విషయంలో ఓం ప్రకాష్ చౌతాల, ఆయన కుమారుడు సహా మరో 53 మందికి విధించిన పదేళ్ల జైలు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. ఈ కుంభకోణంలో కింది కోర్టు విధించిన శిక్షను తగ్గించాలని చౌతాల సహా ఆయన కుమారుడు ఢిల్లీ హైకోర్టులో అప్పీలు దాఖలు చేసుకున్నారు.

కాగా, అప్పిలుపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మ్రిదుల్ ఉపాధ్యయ కుంభకోణం కేసులో ప్రత్యేక సీబిఐ కోర్టు విధించిన పదేళ్ల జైలు శిక్షను సమర్థించారు. ఈ కేసులో దోషులుగా తేలిన షేర్ సింగ్ బాద్షామీ సహా ఇద్దరు ఐఎఎస్ అధికారుుల విద్యాధర్, సంజీవ్ కుమార్ లకు విధించిన శిక్షను కూడా సమర్ధించింది. ఉపాధ్యయ నియామకాల ప్రసహనాన్ని మొత్తంగా లంచమయంగా మార్చారని కోర్టు అభిప్రాయపడింది. నియామకాలలో ప్రజా ప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చారని కూడా న్యాయస్థానం అభిప్రాయపడింది.  ఈ కేసులో పెండింగ్ లో వున్న అన్ని బెయిల్ ధరఖాస్తులను తోసిపచ్చింది. దోషులందరినీ పోలీసులకు సరండర్ కావాలని సూచించింది.

 2000 సంవత్సరంలో దాదాపు 3,206మంది జూనియర్ టీచర్ నియామకాలకు సంబంధించి అవినీతికి పాల్పడ్డారని చౌతాల సహా ఆయన కుమారుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. మరికొంతమందికి నాలుగేళ్లు, ఇంకొందరికి ఐదేళ్ల శిక్ష పడింది. కాగా నాలుగేళ్లు శిక్ష పడిన వారిపై న్యాయస్థానం కనుకరించింది. వారి శిక్షను రెండేళ్లకు పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రెండేళ్లు జైలు జీవితం గడిపిన నిందితులను విడుదల చేయాలని న్యాయస్థానం అదేశాలు జైలు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Delhi High Court  eachers recruitment scam. Om Prakash Chautala  

Other Articles