Shiv sena attacks devendra fadnavis

shivasena, Devendra Fadnavis, samna, maharastra cm, modi, govind pansare, toll tax,

Shiv Sena Attacks Devendra Fadnavis: 'Only CM has Changed in Maharashtra. Nothing Else': shiva sena magazine samna publish a atricle on maharastra cm fadnavis. on the issue of govind pansare firing.

మహారాష్ట్ర సిఎం మారారు..అంతే ఇంకేం మారలేదు: శివసేన

Posted: 02/23/2015 11:10 AM IST
Shiv sena attacks devendra fadnavis

బీజేపీ పార్టీపై శివసేన ఆరోపణలు ఆగడం లేదు. రోజుకో అంశంతో భాజపా పై మండిపడుతోంది శివసేన. దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే జతకట్టిన భాజపా, శివసేనలు గత ఎన్నికల ఫలితంగా రెండు పార్టీల మధ్య కొంత అగాతం ఏర్పడింది. అయితే అది రోజురోజుకు పెరుగుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన శివసేన, ఇప్పుడు భాజపానే లక్ష్యంగా ఆరోపణల పర్వానికి తెరలేపింది. మొన్నటి దాకా భాజపాను తిట్టిపోసిన శివసేన, నిన్న అమాంతం ఆకాశానికి ఎత్తింది. తాజాగా మహారాష్ట్ర సర్కార్ పై ఆరోపణలు చేసింది.

మహారాష్ట్రలో సిఎంగా ఫడ్నవిస్ ఒక్కరే మారారని, మిగతా ఏ విషయమూ మారలేదని శివసేన పత్రిక సామ్నాలో కథనం ప్రచురించడం జరిగింది. అయితే సిపిఎం నేత,టోల్ ట్యాక్స్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గోవింద్ పన్సారే పై దుండగులు కాల్పులు జరపడం, పన్సారే మృతి చెందడం జరిగాయి. మహారాష్ట్రలో కేవలం ఫడ్నవిస్ మాత్రమే మారారని, అది కాకుండా మిగిలిన వ్యవస్థలో ఎలాంటి మార్పులేదని ఆరోపింది. పన్సారే మృతికి కారణమైన దుండగులను పట్టుకోవడంలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించింది. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడపడంలో విఫలమైన ఫడ్నవిస్ ను రాజీనామా చెయ్యాలని ప్రజలు కోరుతున్నారని తెలిపింది. మహారాష్ట్రలో శాంతి భద్రతలను కాపాడటంలో ఫడ్నవిస్ విఫలమయ్యారని ఆరోపించింది. మొత్తానికి నిన్నటి దాకా మోదీపై విరుచుకుపడ్డ శివసేన, తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవిస్ పై విమర్శలు చేసింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shivasena  Devendra Fadnavis  samna  maharastra cm  modi  govind pansare  toll tax  

Other Articles