Telanagana govt may allot more budget for mahabubnagar

budget, telanagana budget, fiananial statement, harish rao, mahabubnagar, irrigation,

telanagana govt. may allot more budget for mahabubnagar : telangana govt. moving to allot more budget as possible as for the irrigation projects of mahabubnagar dist. irrigation minister harish rao trying to get more in new budget of telangana.

బడ్జెట్ లో పాలమూరుకు పెద్దపీట

Posted: 02/21/2015 08:41 AM IST
Telanagana govt may allot more budget for mahabubnagar

ఈ సారి తెలంగాణ బడ్జెట్‌లో పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యమిచ్చేలా నీటి పారుదల శాఖ కసరత్తులు చేస్తోంది. కృష్ణా జలాలను కేటాయింపుల మేర వినియోగించుకోవడంలో విఫలమవుతున్నారని, దానికి ప్రధాన కారణం పాలమూరు ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోవడమేనని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో వీటికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటిని పూర్తి చేయడం ద్వారా వచ్చే ఖరీఫ్ నాటికే సుమారు 3లక్షల ఎకరాలకు,ఆపై వచ్చే ఆర్ధిక ఏడాదికి పూర్తి స్థాయి ఆయకట్టుకు నీరందించాలని ప్రణాళికలు వేస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర అధికారులతో కలిసి మహబూబ్‌నగర్ ప్రాజెక్టులపై  మంత్రి టి.హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు.

ప్రభుత్వం కొత్తగా చేపట్టాలని నిర్ణయించిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి 14,350 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చంది. తొలి ఏడాదే రూ.1500  కోట్ల మేర కేటాయింపులు జరపాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధిత అధికారులు ఇప్పటికే ప్రాజెక్టుకు రూ.3వేల కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలు పంపగా వాటిలో సగం ఇచ్చేందుకు ఆర్ధిక శాఖ సమ్మతి తె లిపినట్లుగా తెలిసింది. శుక్రవారం నాటి సమీక్షలో ఈ అంశం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : budget  telanagana budget  fiananial statement  harish rao  mahabubnagar  irrigation  

Other Articles