Passport uodates will shortly in smart mobiles

passport updates in mobile, smart phone, passport, passport regional office

passport uodates will shortly in smart mobiles : govt. trying to provide the facility to know the details of passport in smart phones.

సెల్ ఫోన్ లో పాస్ పోర్ట్ వివరాలు..త్వరలోనే

Posted: 02/14/2015 10:39 AM IST
Passport uodates will shortly in smart mobiles

విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఖచ్చితంగా పాస్ పోర్ట్ కావాలి. మన దగ్గర పాస్ పోర్ట్ ఎలా పొందాలో చాలా మందికి తెలియదు. పాస్ పోర్ట్ అప్లికేషన్ లను ఇ- సేవా కేంద్రాల ద్వారా స్వీకరిస్తామని గతంలో చేసిన ప్రకటన ఎంతోమందికి ఊరటనిచ్చింది. అయితే పాస్ పోర్ట్ ఎలా పొందాలో తెలియక చాలా మంది ఏజెంట్లను నమ్ముకుంటున్నారు. ఏజెంట్లు మాత్రం తమ కమీషన్ కోసం ఆలోచిస్తున్నారు కానీ, విదేశాలకు వెళ్లిన తరువాత తన క్లైంట్ పరిస్థితి  ఏంటి అని ఆలోచించడం లేదు.

అయితే తాజగా పాస్ పోర్ట పొందడానికి మరింత సులభం చేస్తోంది ప్రభుత్వం. పాస్ పోర్టుకు సంబందించిన అన్ని వివరాలను స్మార్ట్ ఫోన్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని చీఫ్ పాస్ పోర్ట్ ఆఫీసర్ ముక్తేశ్ పర్దేశి తెలిపారు. పాస్ పోర్ట్ కోసం దరఖాస్తు చెయ్యడం, దానికి అటాచ్ చెయ్యాల్సిన డాక్యుమెంట్స్ ఇలా అన్ని వివరాలు స్మార్ట్ ఫోన్ ద్వారానే అందించాలని కృషి చేస్తున్నట్లు ఆయన అన్నారు. స్మార్ట్ ఫోన్ లో మొత్తం ప్రపంచాన్ని చుట్టి వచ్చే వారికి ఇక మీదట పాస్ పోర్టుకు సంబందించిన అన్ని వివరాలు చేతిలో ఉన్నట్లే. గంటలు గంటలు లైన్ లో నిల్చొని , వివరాలను తెలుసుకునే రోజులు పోనున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ కు సమాచారాన్ని చేరవేసేందుకు చేస్తున్న ప్రయత్నం ఇంకా పూర్తిగా ప్రజలకు అందేసరికి కాస్త సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అయినా రానున్న రోజుల్లో పాస్ పోర్ట్ కష్టాల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది అని మాత్రం చెప్పవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : passport updates in mobile  smart phone  passport  passport regional office  

Other Articles