Ktr comment tdp need to change its name as other country party

ktr on babu, ktr comment tdp, ttdp. cm chandrababu, ktr propose to name change, it minister ktr

ktr comment tdp need to change its name as other country party.: ktr fire on cm chandrababu.

తెలుగుదేశం పార్టీ కాదు పక్క దేశం పార్టీ

Posted: 02/11/2015 01:09 PM IST
Ktr comment tdp need to change its name as other country party

ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ పేరును  పక్క దేశం పార్టీ అంటూ పేరు మార్చాలని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావ్ సలహా ఇచ్చారు. హైదరాబాద్ లో కొన్ని రోజుల క్రితం సమీక్ష నిర్వహిస్తు చంద్రబాబు హైదరాబాద్ నుండి పాలస్తుంటే వేరే దేశం నుండి పాలిస్తున్నట్లు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిపై కెటిఆర్ స్పందిస్తు తెలుగుదేశం పార్టీ పేరును మార్చుకోవాలని సూచించారు.

ఏపి ఖజానాలో డబ్బులు లేవంటూనే మరోవైపు రూ.15 కోట్లతో చంద్రబాబు తన ఛాంబర్ను మరమ్మతు చేయించుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. చంద్రబాబు వరంగల్ పర్యటనకు ముందే తెలంగాణకు న్యాయంగా రావాల్సిన కరెంట్, నీటి వాటాలపై వివరణ ఇవ్వాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మరికొద్ది రోజుల్లో చంద్రబాబు వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు పర్యటనపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో చూడాలి.

తెలంగాణ టిడిపి నేతలకు, టిఆర్ఎస్ నాయకులు, మంత్రులకు మధ్య కొద్ది రోజులుగా మాటల యుద్దం నడుస్తోంది. తెలగుదేశం పార్టీకి చెందిన ఎర్రబెల్లి దయాకర్ రావ్ ఆంధ్ర ప్రాంతానికి ప్రతినిధిగా మాట్లాడుతున్నారంటూ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావ్ విమర్శించారు. దమ్ముంటే చంద్రబాబు తన మీద పోటీ చెయ్యాలని సవాల్ విసిరిన తలసాని శ్రీనివాస్ యాదవ్ మాటలపై టిటిడిపి నేతలు స్పందించారు. తలసానిపై పోటీ చెయ్యడానికి చంద్రబాబు అవసరం లేదని తెలుగుదేశం మామూలు కార్యకర్త చాలంటూ వియర్శించారు. ఇలా టిడిపి, టిఆర్ఎస్ ల మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : it minister ktr  ktr on babu  ktr comment tdp  

Other Articles