Nitish kumar likely to return as bihar cm

Nitish kumar likely to return as Bihar CM, Nitish kumar returns Bihar CMManjhi expelled from the party, Manjhi expelled from JD(u), nitish kumar to return as bihar cm, Manjhi appealed to dissolve assembly, manjhi appealed governor KN Tripathi to dissolve assembly, Nitish Kumar, Jitan Ram Manjhi, Dissolution, Bihar CM, bihar assembly polls, Bihar CM, Jitam Ram Manjhi, Narendra Modi, Nitish Kumar, Political Play, Sharad Yadav, janata dal united president

In a dramatic turn of events in Patna on Saturday, the Janata Dal (United) expelled rebel Bihar chief minister Jitan Ram Manjhi from the party

మళ్లీ ముఖ్యమంత్రిగా వచ్చేందుకు రంగం సిద్దం..

Posted: 02/07/2015 08:36 PM IST
Nitish kumar likely to return as bihar cm

శరవేగంగా మారుతున్న బిహార్ రాజకీయ ముఖచిత్రంలో మరో ముఖ్యఘట్టం చోటుచేసుకుంది. తాజాగా శనివారం రోజున జరిగిన జేడీయూ శాసనసభా పక్ష సమావేశంలో తమ నేతగా ప్రస్తుతం వున్న జితిన్ రామ్ మాంఝీని కాదని, మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను తమ నేతగా నితీష్‌కుమార్‌ను పార్టీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొన్ని గంటల క్రితమే బిహార్ ముఖ్యమంత్రి మాంఝీ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. దీనిలో శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించారు. అనంతరం వేగంగా చోటు చేసుకున్న పరిణామాల్లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ను పార్టీ శాసనసభా పక్షనేతగా ఎన్నుకుంది.

అంతేకాదు బిహార్ ముఖ్యమంత్రి మాంఝీను జనతాదళ్(యూనైటెడ్) నుంచి బహిష్కరించారు. ఈ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంది. పార్టీ కల్పించిన హోదాతో ముఖ్యమంత్రిగా నియమితులైన మాంఝీ.. చివరకు ప్రభుత్వాన్ని రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆయనపై వేటు వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ తనను వెలి వేసిందన్న సమాచారం అందడంతో.. మాంఝీ తన మంత్రి వర్గం నుంచి మరో 19మంది మంత్రులను తొలగించాలని గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠికి సిఫార్సు చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Jitan Ram Manjhi  Dissolution  Bihar CM  

Other Articles