Will not contest polls but will actively participate in campaigning sheila dikshit

Sheila Dikshit, Former Delhi chief minister Sheila Dikshit, delhi assembly elections, sheila not contesting polls, sheila participates in campaining, senior congress leader, Ajay maken, former union minister, former delhi minister, AAP, aam aadmi party, BJP, congress, delhi assembly elections 2015,

Former Delhi chief minister Sheila Dikshit on Wednesday said she would not contest the assembly polls, however, she added that she would actively participate in the campaigning.

ఎన్నికల్లో పోటీ చేయను.. ప్రచారం మాత్రమే నిర్వహిస్తాను..

Posted: 01/14/2015 10:25 PM IST
Will not contest polls but will actively participate in campaigning sheila dikshit

మూడు పర్యాయాలు ఢిల్లీ ఫీఠాన్ని అధిరోహించిన మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు షీలాదీక్షిత్ గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూడటంతో మంచి నిర్ణయం తీసుకునన్నారు. ప్రస్తుతం ఉత్తరాన రాష్ట్రాలలో కాంగ్రెస్ క్రమంగా అన్ని రాష్ట్రాలలో తమ ఉనికి కోల్పుతున్న తరుణంలో.. ఫిబ్రవరి 7న జరగనున్న ఢిల్లీ శానససభ ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని, ఈ విషయం తాను ఇదివరకే చెప్పానని దీక్షిత్ అన్నారు. అయితే కాంగ్రెసు తరఫున ప్రచారం మాత్రం చేస్తానని, పార్టీ విజయానికి అంకితబావంతో పనిచేస్తానని ఆమె అన్నారు.

కాంగ్రెసు ప్రచార సారథిగా అజయ్ మాకెన్‌ను ఎంపిక చేయడంపై ప్రతిస్పందిస్తూ, తాను ఇకపై క్రియాశీలక రాజకీయాలలోకి రానని ప్రకటించానన్నారు. కొత్త తరం నాయకుడిని ఎంపిక చేసుకోవడం మంచిదని ఆమె అన్నారు. అజయ్ మాకెన్ పార్లమెంటు సభ్యుడని, గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం వుందన్నారు. మకెన్ ఢిల్లీలో తన హయంలో కూడా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారని, మంచి అనుభవ శాలయంటూ అతనికి కితాబిచ్చారు.

కాగా, బిజెపి, ఆమ్ ఆద్మీ పార్టీలు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడుతాయని సర్వేలు తెలియజేస్తున్నాయి. బిజెపికి మెజారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు కూడా చెబుతున్నాయి. అయితే కాంగ్రెసు తన పరిస్థితిని మెరుగు పరుచుకునే ఆలోచనలో ఉంది. గతంలో 8 స్థానాలకు పరిమితమైన కాంగ్రెస్.. తమ సంఖ్యను రెండెంకలు చేర్చుకునే ప్రయత్నంలో వుంది. కాగా అజెన్ మకెన్ కాంగ్రెస్ పూర్వ వైభవం వైపు పార్టీని తీసుకెళ్లగలరా..? అన్న సందేహాలు కూడా తలెత్తుతున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheila dixit  congress  delhi assembly elections 2015  

Other Articles