Syed ismail afaq information about dilsukhnagar blast

Syed Ismail Afaq, Syed Ismail Afaq on Dilsukhnagar Blast case, bomber Syed Ismail Afaq, Dilsukhnagar Blast case, Syed Ismail Afaq arrest, Saddam Hussain, Abdus Sabur, Dilsukhnagar bomb blast, Dilsukhnagar blast latest, Bangalore blast, Bangalore blast latest, Bangalore blast updates, Bangalore blast arrests, IM terrorists arrest

Syed Ismail Afaq information about Dilsukhnagar Blast : Bangalore police questioned terrorirsts Syed Ismail Afaq, Saddam Hussain, and abdus Sabur in Bangalore blast case and Dilsukhnagar case. Syed Ismail Afaq agreed about Dilsukhnagar blast, confirms that he made bombs for attack before 4Hours

దిల్ సుఖ్ నగర్ బాంబులు చేసింది నేనే !

Posted: 01/12/2015 11:38 AM IST
Syed ismail afaq information about dilsukhnagar blast

రెండేళ్ల క్రితం జరిగిన దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో పోలిసులు పురోగతి సాధించారు. ఈ మారణకాండకు బాంబులను తయారు చేసిన నిందితుడిని పోలిసులు అరెస్టు చేశారు. రెండ్రోజుల క్రితం అరెస్టయిన ఉగ్రవాదులు సయ్యద్ ఇస్మాయల్ అఫక్, సద్దాం హుస్సేన్, అబ్దుల్ సాబుర్ ను విచారించగా కీలక సమాచారం వెల్లడించారు. బెంగళూరు పేలుళ్ల కేసులో అరెస్టయిన వీరు..., నగరంలో దాడి చేసింది తామే అని అంగీకరించారు. అంతేకాకుండా దేశంలో ఇతర ప్రాంతాల్లో దాడులతో గల సంబంధాలను విచారణలో వెల్లడించారు.

హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్లతో తమకు సంబంధం ఉందని ఉగ్రవాదులు అంగీకరించారు. మరోవైపు ఈ ఉన్మాద ఘటనకు బాంబులు తయారు చేసినట్లు పోలిసులతో అఫక్ చెప్పాడు. పేలుళ్లకు నాలుగు గంటల ముందు బాంబులను తయారు చేశామని చెప్పారు. ఈ కేసును విచారిస్తున్న ఎన్.ఐ.ఏ. అధికారులు అఫక్ ను పీటీ వారంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చే అవకాశం ఉంది. దాడి జరిగి రెండేళ్ళు గడుస్తున్నా కేసును విచారిస్తున్న ఎన్.ఐ.ఏ. ఇంతవరకు ఏ అరెస్టు చేయలేదు. కాని బెంగళూరు ఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే ఉగ్రవాదులను పోలిసులు అరెస్టు చేశారు. ఈ విషయంలో ఎన్.ఐ.ఏ.పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore Blast  Dilsukhnagar Blast  syed Ismail Afaq  

Other Articles