57 people killed in fiery pakistan bus oil tanker crash

57 people killed in accident, bus crashed into oil tanker, bus igniting fierce blaze, southern pakistan bus accident, karachi bus accident, death toll increases in pakistan, death toll increases in pak accident

At least 57 people including women and children were killed when their bus crashed into an oil tanker

ప్రయాణికులతో అగ్నికి అహుతైన బస్సు

Posted: 01/11/2015 01:04 PM IST
57 people killed in fiery pakistan bus oil tanker crash

పాకిస్థాన్ లో ఆదివారం ఉదయం  ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రాంగ్ రూట్ లో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొన్నడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ ను ఢికొనడంతో బస్సులో మంటలు వ్యాపించాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ సజీవ దహనమయ్యారు. ఇప్పటి వరకు ఈ ఘటనలో కనీసం 57 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

కరాచీ నుంచి షికాపూర్ కు వెళుతున్నఓ బస్సును సూపర్ హైవేపై అతి వేగంగా వస్తున్నఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో రెండు వాహనాల్లో మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో భారీ సంఖ్య లో ప్రాణ నష్టం వాటిల్లింది. అయితే మృతుల సంఖ్య మరింత పెరగవచ్చునని కారాచీ జిన్హా అస్పత్రి వైద్యులు డాక్టర్ సెమి జమాలీ ఆందోళన వ్యక్తం చేశారు.

తాము 60 మంది కన్నా ఎక్కువగా మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, అవన్నీ పూర్తిగా కాలిన దశలో వున్నాయని, వారిని గుర్తించే స్థితిలో లేవని చెప్పారు. ఆరుగురు పిల్లల మృతదేహాలు వారి తల్లులకు అతుక్కుని వున్నాయని చెప్పారు. వారందరికీ డీఎప్ ఏ పరీక్షలు నిర్వహించిన తరువాతే.. మృతుల వివరాలు స్పష్టమవుతాయని చెప్పారు.
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : road accident  pakistan  57 died  oil tanker  

Other Articles