Kcr latest comments on

Kcr comments, Kcr latest updates, Kcr warangal tour, Kcr latest updates, Kcr warangal tour updates, Telangana latest updates, Telangana news, Warangal latest news, Kcr, Kcr family, determination quotes, confidence quotes

Kcr Latest comments : Telangana CM Kcr makes comments on confidence and Determinism. Everyone must work with dedication and determination than nothing will be impossible says kcr. telangana chief minister warangal tour continues for fourth day

కేసీఆరూ.. ప్రతిసారి ఇదే ఉదాహరణా..! ?

Posted: 01/10/2015 12:32 PM IST
Kcr latest comments on

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటల గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ప్రధానినే సూటిగా, ఏక వచనంతో విమర్శించిన వ్యక్తీయన. ఇక రాజకీయ ప్రత్యర్ధులను అయితే తెలంగాణ బాష, యాసతో ప్రజలకు నచ్చే విధంగా ఒక పద్దతి ప్రకారం తిడుతుంటారు. కానీ ముఖ్యమంత్రి ఈ మద్య ఒకే పదం ఉదాహరణను ప్రతి సారి ఉపయోగిస్తున్నారు. సందర్బం, సమయం ఏదయినా సరే.., నన్ను చూసి నేర్చుకొండి అని చెప్పేస్తున్నారు. తాజాగా పట్టుదలపై కూడా కేసీఆర్ ఇదే ఉదాహరణ ఇచ్చారు. ఇంతకీ అదేమంటే.., ‘నేను తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టిన సమయంలో అంతా ఇది సాధ్యం కాదు అని ఎగతాళి చేశారు. కాని.. పట్టుదలతో సాధించి చూపించా.’ అని చెప్తున్నారు.

తాజాగా వరంగల్ పర్యటన సమయంలో కూడా గరిడేపల్లి సర్పంచ్ కు ఈ మాట చెప్పారు. గ్రామాలను పట్టుదలతో అభివృద్ధి చేయాలన్నారు. పల్లెసీమలు పసిడి కొమ్మలయితే దేశం సమగ్రాభివృద్ధి చెందుతుందన్నారు. పట్టుదల అంటే ఎలా ఉండాలో తనను చూసి నేర్చకొండని పాత ఎగ్జాంపుల్ చెప్పారు. ప్రతి సారీ ఇదే ఉదాహరణ చెప్పటం పట్ల ప్రజలు కాస్త బోర్ ఫీల్ అవుతున్నారు. ఇంకెన్ని రోజులు ఈ మాటలు చెప్తారు..? మీ పట్టుదల తెలంగాణ అభివృద్ధిపై చూపించండి అని సూచనలు ఇస్తున్నారు. ఈ విన్నపాలు సీఎం గారికి వినపడి.., అభివృద్ధిపై కూడా పట్టుదలగా ఉంటే బాగుంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kcr warangal tour  telangana news  Kcr comments  

Other Articles