Amit shah andhra pradesh telangana tour

Amit Shah Andhra Pradesh Telangana Tour, Amit Shah Andhra Pradesh tour, Amit Shah telangana tour, Amit Shah latest updates, Amit Shah comments, Amit Shah on mim, bjp in telangana, bjp in Andhra Pradesh, nda government, telangna latest updates, andhra pradesh updates

Amit Shah Andhra Pradesh Telangana Tour : BJP President Amit Shah puts eye on telugu states and makes tours in Andhra Pradesh Telangana states. Amit Shah says BJP wants to develope in south states particularly in new formed Telangana and Andhra Pradesh

శత్రువులుగా మారనున్న బీజేపి-టీడీపీ

Posted: 01/09/2015 07:59 AM IST
Amit shah andhra pradesh telangana tour

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రెండ్రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్ చేరుకున్న బీజేపీ సారధి ముందుగా తెలంగాణకు చెందిన పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పార్టీ స్థితిగతులు, అభివృద్ధి, కార్యకర్తల చేరికలు తదితర అంశాలపై చర్చించారు. నాలుగేళ్లలో బీజేపిని బలోపేతం చేస్తామని చెప్పారు. గురువారం సాయంత్రం తెలంగాణ పర్యటన ముగించుకుని అమిత్ షా విజయవాడ చేరుకున్నారు. ఇవాళ ఏపీ నేతలతో సమావేశం అవుతారు.

ఇక్కడ కూడా పార్టీ బలోపేతంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రం కోసం బీజేపి చేసిన కృషిని వివరించాలని తెలపగా.., ఏపీకి వచ్చే సరికి రాష్ట్ర పునర్ నిర్మాణం, అభివృద్ధి కోసం గతంలో చేసిన పోరాటం, ప్రస్తుతం అందిస్తున్న సహకారంను ప్రజలకు తెలియజేయాలని కోరనున్నారు. ఏపీలో ప్రస్తుతం పొత్తుగా ఉన్న టీడీపీ కంటే బలమైన క్యాడర్ ను నాలుగేళ్ళలో పొంది సైకిల్ కు షాక్ ఇచ్చేలా మారాలని అమిత్ హితోపదేశం చేస్తారు. అంటే ప్రస్తుతం మిత్రులుగా ఉన్న బీజేపీ-టీడీపీ నాలుగేళ్ళ తర్వాత ప్రత్యర్థులుగా మారవచ్చన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  telangana updates  Andhra Pradesh latest  

Other Articles