Respect the dignity of labour says union minister smruthi irani

HRD Minister Smriti Irani, respect the dignity of labour, minister says respect even daily labour, irani says labours should be respected, Prime minister narendra modi, irani says not to judge any one by their profession, india a country of aspirations, make in india, irani worked in mumbai hotel, irani washed utensils in mumbai,

Urging Indians to respect the dignity of labour, HRD Minister Smriti Irani said that she had once during her struggling days washed utensils at a hotel in Mumbai, 15 years ago.

వృత్తిని గౌరవించండీ.. కూలీలకు కూడా మర్యాదనివ్వండి..

Posted: 01/07/2015 03:57 PM IST
Respect the dignity of labour says union minister smruthi irani

భారతీయులు వృత్తిని గౌరవించాలని పిలుపునిచ్చారు కేంద్ర మానవ వనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీ. దేశంలోని వివిధ రకాల పనులు చేస్తున్న వారందరినీ గౌరవించాలని ఆమె సూచించారు. కూలీలకు కూడా మర్యాదనివ్వాలని కోరారు. పనిచేయని వారు పొందే మర్యాద కన్నా పనిచేస్తున్న వారికి అధిక మర్యాద దక్కాలన్నారు. 15 సంవత్సరాల క్రితం తాను ముంబైలో అడుగుపెట్టిన తొలి రోజుల్లో హోటల్ లో పాత్రలు కూడా కడిగానని అమె తన గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ విషయం చెప్పడానికి తాను సిగ్గు పడటం లేదని, వృత్తి ఏదనా గౌరవించడం తెలియాలని ఆమె సూచించారు.

అన్ని రాష్ట్రాల విద్యా శాఖా మంత్రల సమావేశం సందర్భంగా ‘మేక్ ఇన్ ఇండియా’ పై కీలక ప్రసంగం చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యాలు చేశారు. ఒకరి వృత్తిని ఆదారంగా చేసుకుని వారిని తక్కువగా చూడటం సహేతుకం కాదన్నారు. అన్ని వృత్తుల వారిని సమానంగా గౌరవించాలని పిలుపునిచ్చారు. అలాగే వృత్తి పరంగా కూలీని కూడా గౌరవిన్చినప్పుడే మేక్ ఇన్ ఇండియా కల సాకారమవుతుందని స్మృతి ఇరానీ వివరించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smriti Irani  Education Minster  dignity of labour  Narendra Modi  

Other Articles