Eiffel tower replica in yanam

eiffel tower replica in yanam, yanam eiffel tower, french land mark in yanam, french eiffel tower in yanam, french eiffel tower replica in yanam, french eiffel tower replica in Puducherry, French eiffel tower in andhra pradesh

A replica of one of France's famous landmarks, Eiffel Tower, at Yanam, an enclave of erstwhile French colony Puducherry in Andhra Pradesh.

వీసా, పాస్ పోర్టు లేకుండా.. ఈఫిల్ టవర్ చూశారా..?

Posted: 01/06/2015 10:12 PM IST
Eiffel tower replica in yanam

విశ్వవిఖ్యాత ఈఫిల్ టవర్ చూడాలనుకుంటున్నారా... పాస్ పోర్టు, వీసా లేదని బాధపడుతున్నారా..? ఇక వాటితో పనిలేకుండానే ఈఫిల్ టవర్ ను దర్శించవచ్చు అదేలా అనుకుంటున్నారా..? అయితే యానాం పదండి. ఈఫిల్ టవర్ ప్యారిస్ లో కదా ఉంది. యానాం ఎందుకు అంటారా.  అచ్చుగుద్దినట్టు ఈఫిల్ టవర్ ను పోలిన కట్టడాన్ని యానాంలో నిర్మించారు. స్థానిక గిరియాంపేటలో నిర్మించిన ఈ కట్టడానికి ఒబిలిస్క్‌టవర్ (యానాం టవర్)గా నామకరణం చేశారు.

12 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 45 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని రూపొందించారు. 100.6 మీటర్ల ఎత్తున్న ఈ టవర్ లో పలు ప్రత్యేకతలున్నాయి. కింది అంతస్థులో మీటింగ్ హాల్ ఉంది. 53.3 మీటర్ల ఎత్తువరకు లిఫ్ట్ లో వెళ్లొచ్చు. 21.6 మీటర్ల ఎత్తులో రెస్టారెంట్, 26.5 మీటర్ల ఎత్తులో వీక్షణ మందిరం నిర్మించారు. 250 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను సైతం తట్టుకుని నిలబడేలా దీన్ని డిజైన్ చేశారు. యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు చొరవతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ ఎ.అజయ్ కుమార్ సింగ్ మంగళవారం దీన్ని ప్రారంభించారు. పర్యాటకులను ఒబిలిస్క్‌టవర్ విశేషంగా ఆకట్టుకోనుంది. మీరు చూడాలనుకుంటే యానాంకు పయనం కట్టండి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : eiffel tower  replice  yanam french  

Other Articles