Up cm akhilesh yadav downloads pk piracy

UP CM Akhilesh Yadav, Uttar Pradesh chief minister Akhilesh Yadav, Akhilesh yadav downloads PK movie, PK movie piracy controversy, Akhilesh yadav latest updates, Akilesh admits wacthing piracy PK movie, Akhilesh yadav faces heat on social media, Akhilesh yadav accidentally admits pk’ piracy, bolly wood movies update, bolly wood news,

Uttar Pradesh CM is facing the heat on social media after accidentally admitting at a press conference that he ‘downloaded’ the recently released film ‘pk’ and watched it.

ముఖ్యమంత్రిగా వుంటూ ఇలా కూడా సినిమా చూస్తారా..?

Posted: 01/02/2015 11:20 PM IST
Up cm akhilesh yadav downloads pk piracy

అమీర్ఖాన్ సంచలనాత్మకంగా తీసిన 'పీకే' సినిమా చిత్రం ఇప్పటికే పలు వివాదాలకు దారి తీస్తుండగా, తాజాగా ఓ ముఖ్యమంత్రి ఈ సినిమాకు సంబంధించిన వివాదంలో పీకల్లోతు వివాదంలోకి కూరుకుపోయారు. అటు రివార్డుల పరంగా కూడా ఈ సినిమా సరికోత్త రికార్డులను నమోదు చేస్తున్న సమయంలోనే వివాదాలు కూడా చుట్టుముట్టాయి. ఈ వివాదాల నేపథ్యంలో సినిమా అత్యంత అద్భుతంగా వుందని చెప్పాలనుకున్న ఓ ముఖ్యమంత్రి.. పీకల్లోతు కష్టాలను కొనితెచ్చుకున్నారు. అదెలానో మీరే చదవండి..

తాను సినిమాను డౌన్లోడ్ చేసుకున్నానని, కానీ చూడటానికి మాత్రం సమయం చిక్కడంలేదని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరని చూస్తున్నారా? ఇటీవలే పీకే సినిమాకు పన్ను రాయితీలు ప్రకటించిన ఉత్తర్ ప్రదేశ్ మఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్. విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సినిమా చాలా బాగుందని, అందుకే తమ రాష్ట్రంలో దానికి వినోద పన్ను మినహాయింపు ఇచ్చామని చెబుతూ.. అదే సందర్భంలో నోరు జారారు. చాలా రోజులనుంచి తనను ఈ సినిమా చూడాల్సిందిగా చెబుతున్నారని, అందుకే తాను కొన్ని రోజుల క్రితమే సినిమా డౌన్ లోడ్ చేసుకున్నానని, కానీ ఇన్నాళ్ల బట్టి సమయం దొరక్క గత రాత్రి మాత్రమే చూశానని చెప్పారు. వెంటనే సినిమా నచ్చడంతో దానికి పన్ను రాయితీ ప్రకటించానని, దానివల్ల మరింతమంది సినిమా చూసే అవకాశం దొరుకుతుందని సెలవిచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akhilesh yadav  PK movie  piracy  controversy  

Other Articles