Vasireddy padma says babu lies on new year

Vasireddy Padma, Vasireddy Padma on Chandrababu naidu, Vasireddy Padma on Ap Government, Vasireddy Padma on Kcr, Chandrababu New Year Speech, Chandrababu New year lies, Chandrababu lies on new year, Andhra Pradesh Latest, Andhra pradesh Updates

Vasireddy Padma fires on Chandrababu : YSR congres leader Vasireddy Padma fires on Chandrababu Naidu says he is lying on first day of the year. ysr congress says chandrababu supported for state division with his letter now saying that central government made this cruel work. babu lying on new year day means he continues for whole year says vasireddy

ఎంటి బాబూ ఇది, ఆనాడు కత్తి పట్టలేదా చెప్పు..?

Posted: 01/02/2015 07:59 AM IST
Vasireddy padma says babu lies on new year

రాజకీయ నాయకులంటే చేతల కంటే, మాటల రాయుళ్ళని తెలిసిందే. కాలికి వేస్తే, చెయ్యికి.., చెయ్యికి వేస్తే మెడకు అన్నట్లుగా వారి మాటలకు హద్దుండదు. న్యూ ఇయర్ రోజున ఎవరైనా నిజాలు మాట్లాడాలి, మంచి పనులు చేయాలి, మంచిగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం అబద్దాలు చెప్పారట. ప్రతిపక్షం వారు ఈ విషయం జాగ్రత్తగా పసిగట్టారు. ఇంకేముంది, ప్రెస్ మీట్ పెట్టి, ఇదేమిటి బాబు గారూ అంటూ ప్రశ్నించారు. ఇంతకీ సీఎం చెప్పిన అబద్దమేంటో చూద్దాం. న్యూ ఇయర్ ను పురస్కరించుకుని ఏపీ ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ‘ విభజన సమయంలో మన గుండెల్లో కరకు కత్తులు దించారు’ అనే వాఖ్యం ఉంది. సరిగ్గా ఇదే మాటను వైసీపీ ఆయుధంగా మలుచుకుని టీడీపీని ఆడుకుంది.

బాబు మాటలు పచ్చి అబద్దాలుగా వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆనాడు విభజనకు తాను వ్యతిరేకం కాదు, చేస్తున్న పద్దతికి మాత్రమే వ్యతిరేకిని అని ఢిల్లీకి వెళ్ళిమరీ చెప్పిన ప్రకటన ఏమయిందని ప్రశ్నించారు. ప్రజల గుండెల్లో కత్తి దించారంటున్న చంద్రబాబు, ఆ రోజు విభజన కత్తి పట్టలేదా అని ప్రశ్నించారు. కొత్త సంవత్సరం రోజే నిజాలు మాట్లాడని చంద్రబాబు, ఇక ఏడాదంతా అబద్దాలతోనే గడిపేస్తారని ఎద్దేవా చేశారు. ఈ కామెంట్ చూస్తే, వాసిరెడ్డి ప్రశ్నించింది నిజమే.., విభజనపై బాబుకు లోపల ఏముందో తెలియదు కానీ, బయటకు మాత్రం తాను విభజనకు వ్యతిరేకిని కాదు అని ప్రకటించిన మాట వాస్తవం. అప్పుడలా అన్న వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేసి ఉండకూడదు.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vasireddy Padma  Chandrababu  New year  

Other Articles