Young sage burns girls hands in medak district

young sage burns girls hands, 10th class student young sage, student turns as young sage once a week, young sage in medak district, young sage in narsapur, young sage burns girl students hands, young sage bobby baba, medak hostel cellphone theft

10th class student turns as young sage once a week, burns girls hands in medak district

మీ సెల్ఫోన్ పోయిందా..? ‘బాబీబాబా’ను ఆశ్రయించండీ..!

Posted: 12/27/2014 08:46 PM IST
Young sage burns girls hands in medak district

మీరు సెల్ ఫోన్ పోగొట్టుకున్నారా..?  దాని ఆచూకీ లభించడం లేదా..? ఎంత వైతికినా వృధా అని అనుకుంటున్నారా..? మీకు ఎవరిపైనైనా అనుమానాలు వున్నాయా..? మీ ఫోన్ తస్కరించిన వ్యక్తి గురించి తెలసుకోవాలనుకుంటున్నారా..? అసలు ఇప్పుడు మీ సెల్ పోన్ ఎక్కడుందనేది తెలియాలా..? వారిని పట్టుకోవలా..? అయితే ఆలస్యం చేయకుండా మీరు బాబాను ఆశ్రయంచాల్సిందే.. ఆయన ఎవరు అని సందేహ పడుతున్నారా..? ఆయన మీ పోయిన సెల్ ఫోన్ ను తిరిగి తీసుకురాగల మహిమలు ఉన్న వ్యక్తి నమ్మకం లేదా..? అయితే ఈ ఇది చదవండీ మీకే అతనెవరో తెలుస్తుంది.

 అమీరు బాబీ బాబాను కలవాల్సందే. మెదక్ జిల్లాలో ఓ విద్యార్థి బాబా అవతారం ఎత్తి.. విద్యార్థినుల చేతిలో నిప్పులు పోశాడు. దాంతో తీవ్రంగా గాయపడిన విద్యార్థినులు ఆస్పత్రి పాలయ్యారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మెదక్ జిల్లా నరసాపూర్ మండలం పెద్దచింతకుంట సమీపంలోని సీతారాం తండాలో అల్లూరి సీతారామరాజు గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వినోద్ అనే విద్యార్థి సెల్ఫోన్ ఇటీవల పోయింది. దాంతో.. అతడు 'బాబీ బాబా'ను ఆశ్రయించాడు. సదరు బాబీ బాబా ప్రభుత్వ పాఠశాలలో పదోతరగతి చదువుతున్నాడు. వారానికోసారి బాబా అవతారం ఎత్తుతాడు.

వినోద్ను ఎవరిమీదైనా అనుమానం ఉందా అని బాబీ బాబా అడిగితే.. ఐదుగురు విద్యార్థినుల పేర్లు చెప్పాడు. దాంతో వాళ్లను తీసుకురమ్మని చెప్పగా.. తీసుకెళ్లాడు. వెంటనే బాబీ బాబా వాళ్ల చేతుల్లో నిప్పులు పోసి ఎవరి చేతులు కాలితే వాళ్లే దొంగలన్నట్లుగా అగ్నిపరీక్ష పెట్టాడు. ఐదుగురికి చేతులు కాలడంతో వాళ్లను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 10th class student  young sage  Girls  cell phone  

Other Articles