Andhra pradesh police recruitment interviews cancelled

andhra pradesh police recruitment, andhra pradesh police recruitment interviews, andhra pradesh police recruitment interviews cancelled, andhra pradesh police latest updates, andhra pradesh jobs, andhra pradesh job notifications, andhra pradesh latest updates, telangana jobs latest, latest job notifications, how to face interview, interview tips

andhra pradesh police recruitment interviews cancelled : andhra pradesh police recruitment board cancelled interview. more than three thousand candidates came for interview in vijayawada indhiragandhi stadium. with huge competition police recruitment board called off interview, candidates protest against board decission.

అవాక్కయిన పోలిసులు.., అభ్యర్ధుల ఆగ్రహం

Posted: 12/27/2014 07:29 AM IST
Andhra pradesh police recruitment interviews cancelled

రాష్ర్టంలో ఉన్న నిరుద్యోగ సమస్యను చూసి ఆంధ్రప్రదేశ్ పోలిసులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పోలిస్ శాఖలో ఉన్న ఖాళీల భర్తీ కోసం కొద్ది రోజుల క్రితం సీఐడి నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో వెల్లడించిన ప్రకారం.. ఎంపికైన అభ్యర్ధులకు ఇవాళ ఇంటర్వ్యూలు జరగాల్సి ఉంది. అయితే కేవలం 32 పోస్టులకు 3వేలకు పైగా అభ్యర్ధులు ఇంటర్వ్యూలకు వచ్చారు. దీంతో పోలిసులు చేసిన పొరపాటు తెలుసుకున్నారు. ఒకేరోజు ఇంతమందిని ఇంటర్వ్యూ చేయలేమని.., ఇంటర్వ్యూలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఇంటర్వ్యూల రద్దుకు గల కారణాలు వెల్లడించకపోవటంతో అభ్యర్ధులు ఆగ్రహించి ధర్నాకు దిగారు. పోలిసులకు వ్యతిరేకంగా ఇంధిరాగాంధీ స్టేడియంలో ఆందోళనకు దిగారు. ఇంటర్య్వూ ఉందని చెప్పటంతో తమ పనులు అన్నీ వదిలేసుకుని.., అప్పులు  చేసి మరీ డబ్బులు తీసుకుని విజయవాడకు వస్తే ఇంటర్వ్యూ లేదని చెప్పటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల మద్య అవగాహనా లోపం వల్లే ఇలా జరిగినట్లు స్పష్టం అవుతోంది. ఎన్ని పోస్టులున్నాయి. ఎంతమంది అభ్యర్ధులు ఉన్నారు. రోజుకు ఎంతమందిని ఇంటర్వ్యూ చేయవచ్చు వంటి అంశాలు బేరీజు వేయకుండా పిలిచి... తర్వాత నాలుక కరుచుకోవటం ఏమిటో.

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : andhra pradesh police  job notification  vijayawada latest  

Other Articles