Two thieves caught red handedly arrested in chennai

Thieves slept in robed shop, Thieves manhandled by people, thieves caught red handed, thieves arrested, thieves boozed heavily, chennai police nab two buglers , Tamilnadu thieves dozed off, pallikaranai police station, people help poice nab thieves,

At Perumbakkam main road near Pallikaranai, a few alert citizens helped the city police nab two burglars inside a hardware shop where they had dozed off after drinking the varnish stored there.

చోరి చేశారు.. అక్కడే నిద్రపోయారు.. చివరికి..

Posted: 12/25/2014 05:25 PM IST
Two thieves caught red handedly arrested in chennai

చోరీ చేయడమే మహా పాపం. అందులోనూ మందు కోట్టి చోరికి యత్నించడం ధైర్యం కోసంమని సర్థుకుంటారు దోంగలు. అయితే మందు మరీ ఎక్కువైతే.. ఏం జరుగుతుంది. చైన్నై ఘటనే రిపీట్ అవుతుంది. అదేంటి అనుకుంటున్నారా..? చోరి చేసి పారిపోవాల్సిన దొంగలు అక్కడే నిద్రపోయి అడ్డంగా దోరికిపోయిన విచిత్ర సంఘటన తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో చోటు చేసుకుంది. తాంబరం సమీపం పేరుంబాక్కంలో అర్థరాత్రి ఇద్దరు దొంగలు హార్డువేర్ షాపులో తాళాలు పగులగొట్టారు. అనంతరం షాపులోని క్యాష్బాక్స్లోనలి నగదు, విలువైన వస్తువులతోపాటు ఖరీదైన పెయింటింగ్ డబ్బాలను మూటగట్టారు. అయితే అప్పటికే వారిద్దరూ పూటుగా మద్యం తాగడంతో మత్తులో జోగుతూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. బుధవారం తెల్లవారుజామున ఆ వైపున వెళ్తుతున్న కొందరు వ్యక్తులు దుకాణం తాళాలు పగులకొట్టి ఉండడాన్ని గుర్తించి యజమానికి సమాచారం అందించారు.

యజమాని రాగానే అందరూ కలిసి దుకాణంలోనికి వెళ్లి చూడగా ఇద్దరు దొంగలు మంచి గాఢ నిద్రలో ఉన్నారు. వారిద్దరిని నిద్ర నుంచి లేపి దూహశుద్ధి చేశారు. అనంతరం పల్లికరన్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దుకాణం వద్దకు చేరుకుని... దొంగలకు అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. దొంగలు కార్తీక్ (24), కమలకన్నన్ (25) ఈసీఆర్ రోడ్డుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thieves  arrested  chennai  pallikaranai police  Tamil nadu  

Other Articles