Congress senior leader venkata swamy died

congress leader venkata swamy, g venkata swamy, gudise venkata swamy, kaka venkata swamy, venkata swamy died live, kaka v6 news channel, venkata swamy sons, gaddam vivek, gaddam vinod, peddapalle constituency, gaddam vivek news channel

congress senior leader and central ex minister kaka venkata swamy died, funneral

ITEMVIDEOS: కాకలు తీరిన "కాక"కు అంతిమ వీడ్కోలు

Posted: 12/23/2014 05:43 PM IST
Congress senior leader venkata swamy died

కాంగ్రెస్ అగ్రనేత వెంకటస్వామి మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలనూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీవ్ర దిగ్బ్రాంతి కలిగించింది. ఇప్పటికే కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న ఆయన మొన్నటి వరకు ఎంతో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించి కాంగ్రెస్ పార్టీ కి తన సేవలు అందించారు.

ఆయనది సుదీర్గమైన రాజకీయ జీవితం. తెలంగాణా నుండి స్వయం కృషి తో ఎదిగిన నేత.. ముఖ్యంగా కడు పేదరికం నుండి అంచెలెంచలుగా ఎదిగిన నేత.., గల్లి స్థాయి నుండి ఢిల్లీ స్థాయి దాక ఎదిగి తన సామర్థ్యాన్ని చూపిన నేత... శాసన సభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా దేశం లో సుదీర్ఘ కాలం చట్ట సభలకు ప్రాతినిద్యం వహించిన నేతల్లో ఆయన ఒకరు. ఆయన రెండు సార్లు శాసన సభ్యునిగా, ఏడు సార్లు పార్లమెంట్ సభ్యునిగా గెలిచి చరిత్ర సృష్టించారు. రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా , ఎపిసిసి అధ్యక్షునిగా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా పని చేశారు. ఆయన 1929 అక్టోబర్ 5 న జన్మించారు. ఆయన రాజకీయ ప్రస్తానం హైదరాబాద్ విమోచన ఉద్యమంతో ప్రారంభమైంది. చదువు మానేసి ఉద్యమం వైపు ఆకర్షితుడై, అప్పట్లో స్వామి రామానంద తీర్థ శిష్యునిగా పని చేసి ఆయనతో పాటు వెంకట స్వామి కూడా అరెస్ట్ అయ్యారు. అంబేద్కర్ తో కూడా ఆయనకు మంచి అనుబంధం ఉండేది. అంబేద్కర్ తో కలిసి చాల కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. కార్మికులు పేదల అభ్యున్నతి కోసం యత్నించారు. కార్మిక సంఘాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే వారు, అందుకే ఆయన చాల కార్మిక సంఘాలలో ఇప్పటికి ఒక గౌరవ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పేదలకు ఇళ్ళ నిర్మాణం కోసం కృషి చేసిన వ్యక్తి, పేదలందరికీ అప్పట్లో గుడిసెలు వేయించి గుడిసె వెంకట స్వామి గా ప్రసిద్ది చెందారు. ఇప్పటికి కొందరు తెలంగాణా నేతలు ముద్దుగా కాకా అని పిలుచుకుంటూ ఉంటారు. జీవిత చరమాంకంలో రాష్ట్రపతి కావాలని పరితపించారు. కొన్ని సార్లు ఈ విషయం లో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా దగ్గర పలు మార్లు ప్రస్తావించి మీడియా దృష్టిని ఆకర్షించారు.

ఈ కురువృద్దుడికి ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.., ఇద్దరు కుమారులు ఇప్పుడు రాజకీయాల్లో కొనసాగుతున్నారు. ఆయన కుమారుల్లో వినోద్ రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు. రెండవ కుమారుడు వివేక్ ఎంపి గా పని చేశారు. ఈయన అల్లుడు రాష్ట్ర మాజీ మంత్రి శంకర్ రావు.

కాంగ్రెస్ అగ్ర నేత వెంకట స్వామి అంత్య క్రియలు పంజాగుట్ట స్మశాన వాటికలో జరిగాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చారు. వెంకట స్వామి కి నివాళులు అర్పించి, ఆయన మృతి పార్టీ కి తీరని లోటని వ్యాఖ్యానించారు. అంత్యక్రియలకు చాల మంది ప్రముఖులు హాజరయ్యారు. అంత్య క్రియలు ప్రభుత్వ అధికారిక లాంచనాలతో జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం నుండి పలువురు మంత్రులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నేతలు, తెరాస నేతలు పెద్ద స్థాయిలో హాజరై వెంకట స్వామికి అంతిమ వీడ్కోలు పలికారు. అంతకు ముందే తెలంగాణా ముఖ్యమంత్రి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి వెంకట స్వామి భౌతిక కాయానికి  నివాళులు అర్పించారు.

హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gaddam venkata swamy  congress senior leader died  funneral  

Other Articles